నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను..!

ఒక హీరో ఏదైనా రాజకీయాల మీద సినిమా తీశాడంటే చాలు.. రాజకీయాల్లోకి వచ్చేస్తాడేమోనన్న ఊహాగానాలు మొదలవుతూ ఉంటాయి. ఇక టాప్ హీరోల సినిమాలు రాజకీయాల మీద వచ్చిన తర్వాత అయితే వారిని రాజకీయాల్లోకి లాగాలనే చూస్తూ ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే మహేష్ బాబు మాత్రం తాను జీవితంలో రాజకీయాల్లోకి రానని చెప్పేశాడు.

‘భరత్‌ అనే నేను’ చిత్రం విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం మహేష్‌బాబు ఆయన విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం క్యాపిటల్‌ సినిమాస్‌లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని చూసి, మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని సూపర్ స్టార్ మహేష్‌బాబు స్పష్టం చేశారు. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు ఎప్పడికీ రుణపడి ఉంటాను అని తెలిపారు. ఓ ప్రశ్నకు మహేష్ సమాధానమిస్తూ.. ‘‘నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను. మరో వందేళ్ల వరకు సినిమాల్లోనే నటిస్తా’’ అని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here