అబ్బాయిలకు కేటీఆర్ సెల్ఫీ ఇస్తారు అన్న ట్వీట్ కు మహేష్ బాబు ఏమన్నారంటే..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సోషల్ మీడియాలోనూ.. యూత్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఆయన్ను బాగా ఫాలో అవుతూ ఉంటారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలో అయ్యే అతి కొద్ది మందిలో కేటీఆర్ కూడా ఒకరు. తాజాగా కేటీఆర్ పెట్టిన ఒక ట్వీట్ కు మహేష్ బాబు స్పందించారు. అంతేకాదండోయ్ నవ్వుతూ ఈమోజీ కూడా పెట్టేశారు.

ఇంతకూ ఆ ట్వీట్ ఏమిటనే కదా..? రీసెంట్ గా ఓ పబ్లిక్ ఈవెంట్ కు వెళ్లిన కేటీఆర్ అక్కడున్న యూత్ తో కలిసి సెల్ఫీ దిగారు. సెల్ఫీలో ఉన్న కుర్రాళ్లలో ‘కోటి అను నేను’ అనే వ్యక్తి సరదాగా ‘‘ఇది నిజం.. కేటీఆర్ గారు అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తారు’’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ మహేష్ బాబును ట్యాగ్ చేసి మహేష్ అది నీకోసమే అని అన్నారు. ఇది మహేష్ కు కూడా నచ్చినట్టుంది. అందుకే నవ్వినట్టుగా ఉన్న ఈమోజీ పెట్టి రిప్లయ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా మరోసారి కేటీఆర్-మహేష్ బాబుల స్నేహం బయటకు వచ్చింది. ఇటీవల విడుదలైన మహేష్ బాబు చిత్రం భరత్ అనే నేను సినిమా ప్రమోషన్స్ లో కూడా కేటీఆర్ గారు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here