డిప్రెషన్ లో ఉన్నప్పుడు మీరే నా డాక్టర్ మహేష్ బాబు.. అని ఆత్మహత్య చేసుకున్న అభిమాని..!

డిప్రెషన్.. ఎంతోమంది దీని వలన ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మానసిక ఒత్తిడిని అధిగమించలేక.. ఆత్మహత్య ఒక్కటే మార్గం అని భావించి ప్రాణాలను తీసుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఓ మహేష్ బాబు అభిమాని కూడా మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ తల్లిదండ్రులకు.. ఇంకో లెటర్ మహేష్ బాబుకు రాశాడు.

గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థి హాస్టల్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు ఓ లేఖ, నటుడు మహేష్ బాబుకు మరో లేఖ రాశాడు. గుంటూరు కి చెందిన పులి సునందకుమార్ రెడ్డి హైదరాబాద్ లో చదువుతున్నాడు . తీవ్ర మానసిక ఒత్తిడి కి గురైన సునందకుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడైనా తీవ్ర నిరాశగా ఉన్నప్పుడు మహేష్ బాబు సినిమాలు చూసి ఆత్మస్థైర్యాన్ని పొందుతానని కూడా సూసైడ్ నోట్ లో రాసాడు. మహేష్ సినిమా చూడటం వల్లే ధైర్యంగా ముందుకు సాగుతానని మీరే నా డాక్టర్ అంటూ లెటర్ రాయడం అందరినీ కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here