`క‌త్తి` కామెంట్స్‌: కేసీఆర్‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసింది అందుకేనా?

ప్ర‌ముఖ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్‌.. మ‌రోసారి క‌త్తిలాంటి కామెంట్స్ విసిరారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ప‌వ‌న్ కల్యాణ్ భేటీ కావ‌డంపై ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.

`ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌డిగాపులు ముఖ్య‌మంత్రికి విషెస్ చెప్ప‌డం కోస‌మా? త‌న నెక్స్ట్ మూవీ `అజ్ఞాత‌వాసి` ప్రీమియ‌ర్ షోల అనుమ‌తి కోస‌మా?` అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేశారు.

`అజ్ఞాత‌వాసి ప్రీమియ‌ర్ షోస్ ఎన్ని ప‌డ‌తాయో చెప్పు బ్ర‌ద‌ర్ ఆఫ్ మెగాస్టార్‌` అని మ‌రో కామెంట్ చేశాడు.

ఒక సినిమాకు వ‌చ్చే వ‌సూళ్ల‌ల్లో నైజాం ఏరియా టోటల్ కలెక్షన్స్ లో 50 శాతం ఉంటుంద‌ని, ముఖ్యంగా హైప్ చేసి హైదరాబాద్‌లో ప్రీమియ‌ర్ షోలను ఏర్పాటు చేస్తే ఒక్కో టికెట్‌కు మూడు వేల రూపాయ‌ల నుంచి అయిదు వేల రూపాయ‌లు లాగొచ్చ‌ని చెప్పారు.

ప‌వ‌న్ కల్యాణ్‌కు ఉన్న ఆ బలానికి బలగం తోడు అవ్వాలంటే, కె.సి.ఆర్ అనుగ్రహం కావాలి. భేష్..! అంటూ ఎద్దేవా చేశారు మ‌హేష్ క‌త్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here