మరోసారి అడ్డంగా బుక్ అయిపోయిన పాకిస్థాన్ నటి..!

పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ ను షారుఖ్ ఖాన్ తన రయీస్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇప్పించాడు. ఆ సినిమా ఆమెకు పెద్ద గుర్తింపు తీసుకురాలేకపోయినా వివాదాలు మాత్రం ఆమె చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి సిగరెట్ తాగుతూ కనిపించింది. వారిద్దరి మధ్య ఇంకేదో ఉందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు మరోసారి సిగరెట్ తాగుతూ అడ్డంగా బుక్ అయిపోయింది. దీంతో పాక్ నెటిజన్లు తమ పరువు తీస్తున్నావంటూ తెగ తిడుతున్నారు.

ఓ అవార్డుల వేడుక కోసం న్యూయార్క్ నగరానికి వెళ్లిన మహీరా.. అక్కడ ఓ హోటల్ ఆవరణలో పబ్లిక్ గా సిగరేట్ కాలుస్తూ ఉంది. దీంతో ఎవరో వీడియో తీశారు. వీడియో కెమెరాలను గమనించి సిగరెట్ ను దాచుకునే ప్రయత్నం చేసినప్పటికీ వీలుకాలేదు. ఆ తర్వాతా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మన మత పవిత్రతను – మత గౌరవాన్ని చెడగొడ్డేందుకే మహీరా ఇలా చేస్తోందని తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా ఆమె పొట్టిబట్టలు వేసుకున్నప్పుడు ఇలాగే విమర్శించారు. ఈ 33 ఏళ్ల ముద్దుగుమ్మ 2007లో పెళ్ళి చేసుకొని 2015లో విడిపోయింది. వారికి ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. సీరియల్స్ ద్వారా ఆమె కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here