ఇంకొద్ది నిమిషాల్లో పిల్లలు ఇంటికి చేరుకుంటారన్న సమయంలో.. 9 మంది మృతి..!

మృత్యువు.. ఎప్పుడు.. ఏ రూపంలో కబళిస్తుందో ఎవరూ ఊహించలేరు. పాపం పిల్లలు స్కూలు ముగించుకొని ఇంటికి చేరుకోవాలని రోడ్డు దాటుతున్న సమయంలో ఓ బొలెరో వాహనం పిల్లల మీదకు దూసుకొని వచ్చింది. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది ఇప్పటిదాకా మరణించారు. చనిపోయిన వారిలో 7 మంది చిన్న పిల్లలు. 25 మందికి పైగా ఈ ఘటనలో గాయపడ్డారు. బీహార్ రాష్ట్రం ముజఫ్ఫర్ పూర్ జిల్లాలోని ఆహియాపూర్ లో చోటుచేసుకుంది.

పిల్లలు ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. గాయపడిన వాళ్ళను ముజఫర్ పూర్ లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. మరో ముగ్గురి పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు తెలిపారు. యాక్సిడెంట్ కు కారణమైన బొలెరో డ్రైవర్ ఘటనా స్థలం నుండి పారిపోయాడు. నితీష్ కుమార్ ప్రభుత్వం చనిపోయిన పిల్లలకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తానని ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here