భార్య‌కు విడాకులు ఇచ్చి, రెండో పెళ్లి చేసుకుంటాన‌ని మాటిచ్చాడు..కువైట్ చెక్కేశాడు!

`నాతో స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి. నువ్వు న‌న్నేమీ చేయ‌లేవు. నీ ఇష్టం వ‌చ్చింది చేసుకో. నిన్ను మాత్రం పెళ్లి చేసుకునేది లేదు..` అంటూ బెదిరించాడో ప్రియుడు. దీనితో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఆ యువ‌తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. 80 శాతం కాలిన గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండ‌లంలో చోటు చేసుకుంది. మాక్లూర్‌ గ్రామానికి చెందిన రమ్యకృష్ణ అనే యువ‌తి బీటెక్ విద్యార్థిని. అదే గ్రామానికి చెందిన ప్ర‌సాద్ అనే యువ‌కుడిని ఆమె ప్రేమించింది. అత‌ను వివాహితుడు. భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆమె అత‌ణ్నే ప్రేమించింది. ప్రేమ పేరుతో ప్ర‌సాద్ ఆమెను లొంగ‌దీసుకున్నాడు. భార్య‌కు విడాకులు ఇచ్చి, వివాహం చేసుకుంటానని నమ్మించాడు.

అయిదు నెల‌ల కింద‌ట కువైట్‌కు వెళ్లిపోయాడు. మొద‌ట్లో ఫోన్‌లో మాట్లాడుతూ వ‌చ్చిన ప్ర‌సాద్.. ఆ త‌రువాత మానేశాడు. ర‌మ్య‌కృష్ణ మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. అందుబాటులో ఉండేవాడు కాదు. కొద్దిరోజుల కింద‌ట ఫోన్‌లో ఆమెతో మాట్లాడిన ప్ర‌సాద్‌.. బెదిరించాడు.

త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఉన్నాయ‌ని, పెళ్లి పేరుతో బ‌ల‌వంతం చేస్తే వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తాన‌నీ బెదిరించాడు. దీనితో భ‌య‌ప‌డిన ర‌మ్య‌కృష్ణ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. సోమవారం ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బాధితురాలు 90 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘ‌ట‌న‌పై స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here