నిజం..చీమ కుట్ట‌డం వ‌ల్లే!

రియాద్‌: సౌదీ అరేబియాలో ఓ నమ్మ‌లేని నిజం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఓ చీమ కుట్టడం వల్ల రియాద్‌లో ఉంటున్న ఓ మ‌ల‌యాళీ మహిళ ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని అడూర్‌ ప్రాంతానికి చెందిన సూసీ జెఫ్ఫీ అనే 36 ఏళ్ల మహిళ రియాద్‌లో స్థిర‌ప‌డ్డారు.

త‌న కుటుంబంతో క‌లిసి ఆమె కొన్నాళ్లుగా రియాద్‌లో ఉంటున్నారు. కింద‌టి నెల 19న తన ఇంట్లో ఓ చీమ కుట్టింది. దాన్ని ఆమె తేలిగ్గా తీసుకున్నారు. కుట్టింది చీమే క‌దా అని ప‌ట్టించుకోలేదు. ఆ త‌రువాత అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరారు. అక్క‌డ చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు.

సంఘ‌ట‌న చోటు చేసుకున్న రోజు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని మృతురాలి భ‌ర్త జెప్ఫీ మాథ్యూ విలేక‌రుల‌కు వెల్ల‌డించారు. చీమ కుట్టిన త‌రువాత ఆ ప్ర‌దేశంలో వాపు వచ్చింద‌ని, ఆ వెంట‌నే త‌న భార్య ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ప‌డింద‌ని, దీనితో వెంట‌నే తాను ఆమెను ఆసుప‌త్రిలో చేర్చాన‌ని మాథ్యూ తెలిపారు.

ఆ త‌రువాత అలర్జీ రావడంతో ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారని అన్నారు. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పారు. చీమ కుట్ట‌డం వ‌ల్లే ఈ దారుణం చోటు చేసుకుంద‌ని ఆయ‌న అంటున్నారు. డాక్ట‌ర్లు మాత్రం దీన్ని ధృవీకరించ‌ట్లేదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here