త‌నను అరెస్టు చేయించిన‌ మ‌హిళ‌పై ప‌గ‌బ‌ట్టి, బెయిల్‌పై వ‌చ్చి అత్యాచారం చేసి..!

త‌న‌పై కేసు పెట్టి, అరెస్టు చేయించిన ఓ మ‌హిళ‌పై అతి దారుణంగా ప‌గ తీర్చుకున్నాడో దుర్మార్గుడు. బెయిల్‌పై విడుద‌లై వ‌చ్చిన వెంట‌నే.. నేరుగా ఆమె ఇంటికెళ్లి అత్యాచారం చేశాడు. మ‌ళ్లీ అరెస్ట‌య్యాడు. ఈ దారుణ ఘ‌ట‌న దేశ రాజ‌ధానిలో వ‌సంత్‌కుంజ్‌లో చోటు చేసుకుంది. ఆ నీచుడి పేరు సందీప్ చౌహాన్‌. స్థానికంగా ఓ ఫిజిక‌ల్ ట్రెయిన‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.

 

ఏప్రిల్ 29వ తేదీన రాత్రి వ‌సంత్‌కుంజ్‌లోని ఇంటికెళ్లి కాలింగ్‌బెల్ కొట్టాడు. ఆ ఇంట్లోంచి ఓ మ‌హిళ బ‌య‌టికి రాగా, ఆమె ఎదురుగా త‌న ప్యాంట్ జిప్పు తీసి, అశ్లీల కార్య‌క‌లాపాలు చేశాడు. దీన్ని గ‌మ‌నించిన ఆమె వెంట‌నే వ‌సంత్‌కుంజ్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఆమె ఫిర్యాదు మేర‌కు పోలీసులు సందీప్ చౌహాన్‌ను అరెస్టు చేశారు.

శుక్ర‌వారం సాయంత్రం సందీప్ చౌహాన్ బెయిల్‌పై విడుద‌ల అయ్యాడు. త‌న‌పై ఫిర్యాదు చేసిన మ‌హిళ ఇంటికి అదేరోజు రాత్రి వెళ్లి, ఆమెపై అత్యాచారం చేశాడు. హ‌త్య చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఈ స్థితిలో స్పృహ త‌ప్పిన బాధితురాలు చ‌నిపోయింద‌నుకుని వెళ్లిపోయాడు.

మ‌రుస‌టి రోజు బాధితురాలు మొద‌ట తాను ప‌నిచేసే కార్యాల‌యంలో తోటి ఉద్యోగుల‌కు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. వారి సూచ‌న మేర‌కు శ‌నివారం సాయంత్రం సందీప్ చౌహాన్‌పై ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు బెయిల్‌ను ర‌ద్దు చేశారు. అత‌ణ్ని అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here