ఎయిర్ హోస్టెస్‌పై క‌న్నేశాడు..లైంగికంగా వేధించాడు! అత‌ని వ‌య‌స్సెంతంటే?

న్యూఢిల్లీ: విమానంలో ఏకంగా ఎయిర్ హోస్టెస్‌నే లైంగిక వేధింపులకు గురి చేశాడో పెద్దాయ‌న‌. అత‌ని వ‌య‌స్సు 62 సంవ‌త్స‌రాలు. విమానంలోనే అత‌ను ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. ల‌క్నో-ఢిల్లీ మ‌ధ్య విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. నిందితుణ్ని అరెస్టు చేశారు.

ఈ విష‌యాన్ని విస్తారా ఎయిర్‌లైన్స్ యాజ‌మాన్యం ధృవీక‌రించింది. నిందితుడి పేరు రాజీవ్ వ‌సంత్ డాని. మ‌హారాష్ట్రలోని పుణేకు చెందిన వ్యాపారి. వ్యాప‌ర ప‌నుల కోసం ల‌క్నో వెళ్లిన రాజీవ్‌.. విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్ల‌యిట్ యుకే 997లో న్యూఢిల్లీకి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యాడు. అనంత‌రం- అక్క‌డి నుంచి అత‌ను పుణేకు వెళ్లాల్సి ఉంది.

ల‌క్నో నుంచి న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం టెర్మిన‌ల్ 3కి చేరుకుందా విమానం. ప్ర‌యాణికులు కిందికి దిగే స‌మ‌యంలో.. అత‌ను ఎయిర్ హోస్టెస్ ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. అంద‌రి కంటే చివ‌ర‌గా ఉన్న అత‌ను కిందికి దిగే స‌మ‌యంలో, ఎయిర్ హోస్టెస్‌ను లైంగిక వేధింపులకు గురి చేయ‌డమే కాకుండా.. ఆమెను తిట్టాడు కూడా.

దీనితో బాధితురాలు వెంట‌నే టెర్మిన‌ల్ సిబ్బందికి తెలియ‌జేశారు. వెంట‌నే రాజీవ్‌ను సీఐఎస్ఎఫ్ బ‌ల‌గాల చేతికి అప్ప‌గించారు. అత‌నిపై కేసు న‌మోదు చేశారు. ఈ విష‌యాన్ని విస్తారా ఎయిర్‌లైన్స్ యాజ‌మాన్యం ధృవీక‌రించింది. త‌మ సిబ్బంది ప‌ట్ల ఎలాంటి అనుచిత ప్ర‌వ‌ర్త‌నను తాము స‌హించ‌బోమ‌ని, ద‌ర్యాప్తున‌కు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here