అమ్మాయి వెనుకనే వచ్చాడు.. ముద్దు పెట్టాడు.. వెళ్ళిపోయాడు 43 ఏళ్ల వ్యక్తి..!

పట్టపగలు.. పబ్లిక్ ప్లేస్ లో కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. ఓ అమ్మాయిని రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా అతన్ని కనీసం అడ్డుకోడానికి కూడా ప్రయత్నించలేదు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆడవాళ్ళకు మన దేశంలో ఎదురవుతున్న లైంగిక వేధింపులకు ఈ ఘటన ఓ నిదర్శనం.

ఫోన్ లో మాట్లాడుకుంటూ అమ్మాయి వెళుతుండగా, అమె వెనకే వచ్చిన ఆ వ్యక్తి, ఆమెను బలవంతంగా ముద్దు పెట్టాడు. ఆపై అమ్మాయి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, అతను తనను స్టేషన్ బయటి నుంచే వెంబడిస్తూ వచ్చాడని చెప్పింది. ఆ వెంటనే అక్కడి సీసీటీవీ రికార్డులన్నీ పరిశీలించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వేధించిన వ్యక్తిని 43 సంవత్సరాల నరేష్ జోషి అని గుర్తించారు. నవీ ముంబై లోని తుర్బే పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here