21 ఏళ్ల కోడ‌లిపై క‌న్నేశాడు..అత్యాచారం చేసి, నిప్పెట్టేశాడు!

ఒడిశాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 21 సంవ‌త్స‌రాల కోడ‌లిపై అత్యాచారం చేశాడో కిరాత‌క మామ‌. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో నిర్బంధించి మ‌రీ ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు.

ఈ విష‌యం ఎవ‌రికీ తెలియ కూడ‌ద‌నే ఉద్దేశంతో కోడ‌లి ఒంటిపై కిరోసిన్ పోసి, నిప్పంటించేశాడు. ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. శ‌రీరం దాదాపుగా కాలిపోయిన త‌రువాత, కోడ‌లిని ర‌క్షించిన‌ట్టు నాట‌కం ఆడాడు.

ఆసుప‌త్రిలో చేర్చాడు. 90 శాతం మేర కాలిన గాయాల‌తో బాధితురాలు ఆదివారం రాత్రి మ‌ర‌ణించారు. ఒడిశాలోని మ‌యూర్‌భంజ్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

జిల్లాలోని రాయ్‌రంగ‌పూర్‌కు చెందిన ఆ దుర్మార్గుడి పేరు రామ్‌గోపాల్ ఖేమ్కా. 55 సంవ‌త్స‌రాలు. రెండేళ్ల కింద‌ట త‌న కుమారుడికి రాగిణి (పేరుమార్చాం)తో పెళ్లి జ‌రిపించాడు.

కుమారుడు, కోడ‌లు రాయ్‌రంగ‌పూర్‌లోనే నివాసం ఉంటున్నారు. ఆమెపై క‌న్నేసిన రామ్‌గోపాల్ ఖేమ్కా శుక్ర‌వారం ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

కొన్ని గంట‌ల పాటు ఆమెను నిర్బంధించాడు. అనంత‌రం కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆత్మ‌హ‌త్య‌గా చిత్ర‌క‌రించాడు. తానే ఆసుప‌త్రికి తీసుకెళ్లాడు. జంషెడ్‌పూర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు ఆదివారం సాయంత్రం మ‌ర‌ణించారు.

 

దీనికి కొన్నిగంట‌ల ముందే.. ఆమె పోలీసుల‌కు త‌న మ‌ర‌ణ వాంగ్మూలాన్ని ఇచ్చారు. దీని ఆధారంగా రామ్‌గోపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here