కుక్కను కరిచిన మనిషి.. మీరు విన్నది కరెక్టే..!

ఇప్పటిదాకా మనిషిని కరిచిన కుక్క అనే వార్తలు చాలా చదివారు కానీ కుక్కను కరిచిన మనిషి అన్నది చాలా అరుదుగా వింటూ ఉంటారు. ఈ ఘటన యునైటెడ్ కింగ్డమ్ లో చోటుచేసుకుంది.

జాన్ ఉడ్ అనే 65 సంవత్సరాల వ్యక్తి తన 11 సంవత్సరాల పెంపుడు కుక్క బాబీని తీసుకొని బయటకు వెళ్ళాడు. ఇంతలో బాబీ కుక్కను చూసి వీధిలో ఉన్న మూడు కుక్కలు దాడి చేయడానికి ముందుకు వచ్చాయి. అతడు తన దగ్గర ఉన్న కట్టెను తీసుకొని ఆ కుక్కలను హడలిస్తున్నా కూడా అవి తగ్గలేదు. జాన్ కుక్క బాబీని నోట కరచుకున్నాయి.

దీంతో జాన్ కోపం కట్టలు తెంచుకుంది. బాబీని పట్టుకొని కొరుకుతున్న కుక్కను జాన్ కొరికాడు. దాదాపు 10 సెకెండ్ల పాటూ ఆ కుక్కను కొరకడంతో బాబీని వదిలిపెట్టింది. కుక్కల దాడిలో బాబీ మెడ చుట్టూ గాయాలు అయ్యాయి. ప్రస్తుతం బాబీని ఆసుపత్రిలో చేర్పించారు. బాబీకి దాదాపు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు. ఆ కుక్కల దాడిలో తన బాబీ ఎంతగానో గాయపడిందని జాన్ చెప్పుకొచ్చాడు. తన బాబీ మీద దాడి చేసిన కుక్కల ఓనర్ల సమాచారం తెలుసుకున్న జాన్ వారికి నోటీసులు పంపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here