జీపీఎస్ యాప్‌ను న‌మ్ముకుని అది చూపిన దారిలో వెళ్లాడు..న‌ట్టేట మునిగాడు!

మ‌నిష‌నేవాడు స్వ‌తంత్రంగా ఆలోచించ‌డం మానేశాడ‌నే అనిపిస్తుంది కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను చూస్తే. టెక్నాల‌జీ మీద ఆధార‌ప‌డి బండి లాగించేస్తున్నాడు.

అలాంటి టెక్నాల‌జీని న‌మ్ముకుంటే కొంప కొల్లేరే అని అనిపించే ఘ‌ట‌న ఇది. అమెరికాలో చోటు చేసుకుంది. జీపీఎస్‌ గుడ్డిగా నమ్మి, అది చూపిన దారిలో వెళ్లి కారుతో స‌హా న‌ట్టేట్లో ప‌డ్డాడో వ్య‌క్తి.

అమెరికాలోని వెర్మాంట్ స్టేట్‌లో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌. జీప్‌ కంపాస్‌ను అద్దెకు తీసుకొని..త‌న స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా టూర్‌కు వెళ్లాడు. తాను వెళ్ల‌ద‌ల‌చుకున్న రూట్‌మ్యాప్ అత‌నికి స‌రిగ్గా తెలియ‌దు.

జీపీఎస్ ఉంది క‌దా? అనే ధైర్యంతో ఎలాంటి స‌న్నాహ‌కాలూ లేకుండా గుడ్డిగా వెళ్లిపోయాడు. ప్లే స్టోర్ నుంచి గూగుల్‌కు చెందిన జీపీఎస్‌ యాప్ `వేజ్‌` చూపిన‌ట్టుగా బండిని డ్రైవ్ చేస్తూ వెళ్లాడు.

అందులో సూచించిన దాని ప్ర‌కారం వెళ్ల‌గా.. ఆ రోడ్డు కాస్త నేరుగా ఓ లేక్ ఛాంప్ల‌య‌న్‌కు తీసుకెళ్లింది. అక్క‌డో బోట్ ర్యాంప్ వ‌స్తే దాన్ని చూసుకోకుండా బండి ముందుకు పోనిచ్చాడు.

అదృష్ట‌మో, దుర‌దృష్ట‌మో గానీ.. చ‌లికి ఆ లేక్ గ‌డ్డ‌క‌ట్టుకుపోయి ఉంది. స‌రిగ్గా మూడు మీట‌ర్లు వెళ్ల‌క‌ముందే.. కారు బ‌రువుకు మంచుగ‌డ్డ‌లు ప‌గిలాయి.

కారు నీట్లో మునిగింది. ఈ ప్ర‌మాదాన్ని ముందే ప‌సిగ‌ట్టిన డ్రైవ‌ర్‌, అత‌ని స్నేహితులు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.. గానీ ఖ‌రీదైన కారు నీటిపాలైంది. పోలీసుల‌కు ఈ స‌మాచారం చేర‌వేయ‌డంతో వారు కారును వెలికి తీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here