ప్రియురాలిని క‌లుసుకోవ‌డానికి వెళ్లి..ఆమె భ‌ర్త చేతిలో ప్రాణాలు కోల్పోయాడు!

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఈ ఘ‌ట‌న తెలంగాణలోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. హ‌తుడి పేరు గంగిరెడ్డి. 34 సంవ‌త్స‌రాల గంగిరెడ్డి త‌న ప్రియురాలిని కలుసుకోవ‌డానికి వ‌చ్చి..ఆమె భ‌ర్త చేతిలో దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యాడు.

ప్రకాశం జిల్లా రామయ్యపాలెంకు చెందిన గంగిరెడ్డికి అదే ప్రాంతానికి చెందిన సాదిక్ భాష భార్య‌తో వివాహేత‌ర సంబంధం ఉంది. సుమారు ఆరునెల‌లుగా వారి మ‌ధ్య ఈ వ్య‌వ‌హారం న‌డుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న సాదిక్‌ తన భార్యను మంద‌లించాడు. అయిన‌ప్ప‌టికీ.. ఆమె త‌న వైఖ‌రిని మార్చుకోలేదు. త‌ర‌చూ గంగిరెడ్డిని క‌లుస్తుండేది.

దీనితో విసుగెత్తిపోయిన సాదిక్ భాష కుటుంబంతో స‌హా ఊరొదిలి వెళ్లిపోయాడు. తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా హ‌న్వాడ మండ‌లానికి మ‌కాం మార్చాడు.

హ‌న్వాడ‌లో మేస్త్రీగా ప‌నికి కుదిరాడు. ఎలాగోలా ఈ విష‌యం తెలుసుకున్న గంగిరెడ్డి కూడా త‌న ప్రియురాలిని క‌లుసుకోవ‌డానికి హ‌న్వాడ‌కు వ‌చ్చాడు. నేరుగా అత‌ను సాదిక్‌ భార్యను క‌లుసుకున్నాడు.

దీనితో భ‌య‌ప‌డిన సాదిక్ భార్య‌..అత‌నితో గొడ‌వ‌కు దిగింది. దీన్ని గ‌మ‌నించిన సాదిక్‌.. కూడా అత‌నితో ఘ‌ర్ష‌ణ‌కు దిగాడు. ఈ సంద‌ర్భంగా ఆవేశానికి గురై, క‌త్తితో గొంతు కోశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.

ఈ సంఘటనపై మహబూబ్‌నగర్‌ రూరల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. సాదిక్‌ను పోలీసులు అరెస్టు చేవారు. గంగిరెడ్డి మృతదేహాన్ని మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here