చీపురు పుల్ల‌ల కోసం అడ‌వికెళ్లింది..స‌గం కాలిన మృత‌దేహంగా క‌నిపించింది..!

చీపురుక‌ట్ట‌ల‌ను త‌యారు చేసి, వాటిని విక్ర‌యించ‌డం ఆమె దిన‌చ‌ర్య‌. చీపురు పుల్ల‌ల కోసం వారానికి మూడురోజుల పాటు ఆ మ‌హిళ స‌మీప అట‌వీ ప్రాంతానికి వెళ్తుంటారు. మంగ‌ళ‌వారం కూడా అడ‌వికి వెళ్లిన ఆమె మ‌ళ్లీ వెన‌క్కి రాలేదు. అడ‌విలోనే దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు.

ఈ ఘ‌ట‌న డిసెంబ‌ర్ 30న చోటు చేసుకుంది. ఆమెతో పాటు అడ‌వికి వెళ్లిన మ‌రో మ‌హిళ ఈ విష‌యాన్ని దాచిపెట్టారు. ఈ ఘ‌టన తెలంగాణ‌లోని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

భూ త‌గాదాల విష‌యంలో సొంత సోద‌రుడే ఆమెను హ‌త్య చేయించిన‌ట్టు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. జిల్లాలోని వెంకటాపురం మండలం పెద్దాపురానికి చెందిన మృతురాలి పేరు సార‌క్క‌. వివాహితురాలు. భ‌ర్త‌తో విభేదాల కార‌ణంగా అత‌నికి దూరంగా ఉంటున్నారు.

చీపురు క‌ట్ట‌ల‌ను విక్ర‌యించే వ్యాపారాన్ని నిర్వ‌హిస్తున్నారు. దీనికోసం ఆమె వారానికి మూడురోజుల పాటు అడ‌వికి వెళ్తుంటారు. అదే గ్రామంలో నివ‌సించే ఆమె అన్న ఎల్లయ్యతో భూత‌గాదాలు ఉన్నాయి.

డిసెంబర్‌ 30న సార‌క్క త‌న స‌మీప బంధువు మల్లమ్మతో కలిసి చీపురు పుల్లల కోసం అడ‌వుల‌కు వెళ్లారు. సాయంత్రానికి మ‌ల్ల‌మ్మ ఒక్క‌రే వెన‌క్కి తిరిగి వ‌చ్చారు. సార‌క్క రాలేదు. రాత్ర‌యిన‌ప్ప‌టికీ సార‌క్క ఇంటికి రాక‌పోవ‌డంతో ఆమె చెల్లెలు లక్ష్మి ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

 

మంగళవారం ఉదయం వెంక‌టాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎల్ల‌య్య‌, సార‌క్క మ‌ధ్య భూత‌గాదాలు ఉన్నాయ‌నే విష‌యం పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. ఈ కోణంలో విచార‌ణ చేప‌ట్టారు పోలీసులు. ఎల్లయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా అస‌లు విష‌యం బ‌హిర్గ‌త‌మైంది.

మ‌ల్ల‌మ్మ‌తో క‌లిసి అడ‌వికి వెళ్లిన సార‌క్క‌ను అడ‌విలోనే క‌ర్ర‌ల‌తో దాడి చేసి, కొట్టి చంపామ‌ని, ఈ ఘ‌ట‌న‌కు మ‌ల్ల‌మ్మ ప్ర‌త్య‌క్ష సాక్షి అని ఎల్ల‌య్య వెల్ల‌డించాడు. త‌న కుమారుడితో క‌లిసి సార‌క్క‌ను చంపేసిన‌ట్లు అంగీక‌రించాడు.

అత‌ని చెప్పిన ఆన‌వాళ్ల ప్రకారం..పోలీసులు అడ‌విలోకి వెళ్లి త‌నిఖీలు చేప‌ట్టగా.. స‌గం కాలిన సార‌క్క మృత‌దేహం క‌నిపించింది. పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని, ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here