కొబ్బ‌రిబొండాంలో నిద్ర‌మాత్ర‌! స్నేహితురాలిపై అత్యాచారం: వీడియో తీశానంటూ బెదిరింపు!

హాలిడే ట్రిప్ కోసం త‌న‌తో పాటు వ‌చ్చిన స్నేహితురాలిపై అత్యాచారం చేశాడో యువ‌కుడు. కొబ్బరిబొండాంలో నిద్ర‌మాత్ర క‌లిపాడు. ఆమె మ‌గ‌త‌లోకి జారుకున్న త‌రువాత అత్యాచారం చేశాడు.

ఈ ఘట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. బాధితురాలి పేరు సంత్ర‌స్త‌. బెంగ‌ళూరు విద్యార్థిని. హాస్ట‌ల్‌లో ఉంటూ చ‌దువుకుంటోంది. బెంగ‌ళూరుకే చెందిన దినేష్‌తో ప‌రిచ‌యం ఉంది.

 

రెండేళ్లుగా వారు స్నేహంగా ఉంటున్నారు. క్రిస్మ‌స్ సెల‌వుల సంద‌ర్భంగా దినేష్‌.. క‌ర్ణాట‌క‌లోని పుణ్య‌క్షేత్రం మురుడేశ్వ‌ర్ ట్రిప్‌కు వెళ్దామ‌ని, ఒక్క‌రోజులో తిరిగి వ‌ద్దామ‌ని చెప్పాడు.

దీనికి ఆమె అంగీక‌రించడంతో ఇద్ద‌రూ వెళ్లారు. అదేరోజు రాత్రి బెంగ‌ళూరుకు రావ‌డానికి వారు టికెట్ బుక్ చేసుకున్న బ‌స్సు మిస్ అయ్యింది. దీనితో వారు ఆ రోజు రాత్రి మురుడేశ్వ‌ర్‌లో ఓ హోట‌ల్‌లో గ‌దికి అద్దెకు తీసుకున్నారు.

అదే స‌మ‌యంలో.. దినేష్ కొబ్బ‌రిబొండాంలో నిద్ర‌మాత్ర క‌లిపి త‌న‌పై అత్యాచారం చేశాడు. దీనితో సంత్ర‌స్త అతణ్ణి నిల‌దీయ‌గా పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించాడు.

 

దీనితో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేదు. కొద్దిరోజుల కింద‌ట దినేష్‌కు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చ‌య‌మైంది. ఈ విష‌యం తెలుసుకున్న సంత్ర‌స్త అత‌ణ్ణి ప్ర‌శ్నించ‌గా..అత్యాచార స‌మ‌యంలో తాను వీడియో తీశాన‌ని, పెళ్లిని అడ్డుకుంటే ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తాన‌ని బెదిరించాడు.

ఆ వీడియోను కూడా ఆమెకు చూపించాడు. అది చూసిన సంత్ర‌స్త దిగ్భ్రాంతికి గుర‌య్యారు. దినేష్‌పై బెంగ‌ళూరులో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న‌పై కేసు న‌మోదైన విష‌యం తెలిసిన వెంట‌నే దినేష్ ప‌రార‌య్యాడు. అత‌ని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here