చేతులు నరికేసింది ఇతనికే..!

విజయనగరం జిల్లాలో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి చేతులను నరికేసిన సంగతి తెలిసిందే. అతడికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు నిందితులు ఎల్విన్ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం లొంగిపోయారు.

బిడ్డిక ధనుంజయ తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నా ఆ గ్రామంలో ఉన్న ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిపై పంచాయతీ వరకూ వెళ్లింది. తీరు మార్చుకోమని సర్పంచ్‌‌తో సహా పెద్దలు సూచించినా.. ధనుంజయ అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో.. కక్ష పెంచుకున్న మహిళ బంధువులు పాడి నరేశ్, పాడి శివన్నారయణ, పాడి చిరంజీవి గురువారం అర్ధరాత్రి ధనుంజయ ఇంటికి వెళ్లి మాట్లాడాలని బయటికి పిలిచారు.

గొడవలు ఉండడంతో ధనుంజయ రానన్నాడు.. అయినప్పటికీ బలవంతంగా అతడ్ని గ్రామంలో ఖాళీగా ఉంటున్న ఓ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ అతడి చేతులు, కాళ్లు కట్టేసి.. తీవ్రంగా కొట్టి దుంగలు చెక్కే బాడిద‌తో రెండు చేతులూ నరికేశారు. అనంతరం ధనుంజయని తీసుకెళ్లి సర్పంచ్ ఇంటి ముందు పడేశారు. సర్పంచ్ బయటకి వచ్చి.. ధనుంజయ పరిస్థితి చూసి అంబులెన్స్, పోలీసులకి సమాచారం అందించారు. సీహెచ్‌సీ వైద్యులు బాధితుడి చేతులు పూర్తిగా తొలగించి.. ప్రథమ చికిత్స అనంతరం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి.. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here