రెడ్ బుల్ కొన్నాడు.. ఏదో తేడాగా అనిపించి చూస్తే..!

రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ ఇప్పటికే దీని మీద ఎన్నో వివాదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో వివాదం బయటకు వచ్చింది. అదేమిటంటే ఓ రెడ్ బుల్ లో ఏకంగా చచ్చిపోయిన ఎలుక ఉందట. అమెరికాకు చెందిన జాన్ హెన్లే అనే వ్యక్తి ఈ విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అతడు రెడ్ బుల్ టిన్ ను కట్ చేసి చూడగా.. లోపల ఓ ఎలుక చచ్చిపడి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెడ్ బుల్ తాగే ముందు జాగ్రత్తగా పరిశీలించండి ఎందుకంటే అందులో ఎలుకలు ఉండే అవకాశం ఉంది అని ఆ వీడియోలో చెప్పాడు.

అమెరికాలోని ఆర్కన్సాస్ లో ఉండే అతడు రెడ్ బుల్ ను కొన్నాడు.. అయితే ఆరోజు రాత్రి అతడు దాన్ని తాగలేదు.. కార్ లో పెట్టేశాడు. తర్వాతి రోజు వచ్చి ఆ రెడ్ బుల్ ను చూశాడు. కానీ అది కాస్త బరువుగా ఉన్నట్లు అనిపించింది. దాన్ని తీసి కట్ చేయడం మొదలుపెట్టాడు. వీడియో కూడా తీశాడు. అతడు దానిలోని డ్రింక్ మొత్తాన్ని పారవేయగా.. చివర్లో ఎలుక కనిపించింది. అప్పటికే అది చచ్చిపోయింది. ఇప్పటికే ఈ వీడియోను 3 మిలియన్ల మంది పైగా చూశారు. అతడి వీడియో మీద రెడ్ బుల్ కంపెనీ ప్రతినిధులు మాత్రం తీవ్రంగా విబేధించారు. తాము వరల్డ్ క్లాస్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తయారు చేస్తామని.. ప్యాకింగ్ లో కూడా ఎలాంటి పొరపాట్లు చేయమని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here