డ్రైవ‌ర్ మృత‌దేహం..ఫ్లైఓవ‌ర్‌కు వేలాడుతూ!

భోపాల్‌: ఓ వ్య‌క్తి మృత‌దేహం స్థానికులను ఆందోళ‌న‌కు గురి చేసింది. ఫ్లైఓవ‌ర్‌కు ఉరి వేసుకున్న స్థితిలో క‌నిపించిన ఈ మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకోవ‌డానికి పోలీసులు నాలుగు గంట‌ల పాటు వేచి చూడాల్సి వ‌చ్చింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మురైనా జిల్లా కేంద్రంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

మురైనా న‌గ‌రంలోని ఛౌందా ఫ్లైఓవ‌ర్ వ‌ద్ద గురువారం ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యంలో అటుగా వెళ్తున్న కొంద‌రు వాహ‌న‌దారులు మృత‌దేహాన్ని చూశారు. అన‌త‌రం సివిల్ లైన్ పోలీస్‌స్టేస‌న్‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారే గానీ.. మృత‌దేహాన్ని అలాగే ఉంచారు. దీనికి కార‌ణం.. క్లూస్ టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌, ఫోరెన్సిక్ నిపుణులు స‌కాలంలో చేరుకోక‌పోవ‌డ‌మే.

దీనితో వారి కోసం పోలీసులు మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ వేచి చూడాల్సి వ‌చ్చింది. మృతుడిని గోపాల్‌పూర్‌కు చెందిన ట్ర‌క్ డ్రైవ‌ర్ స‌త్‌పాల్ సింగ్‌గా గుర్తించారు. మృతుడి జేబులో ల‌భించిన ఆధార్‌కార్డు ఆధారంగా కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఆర్థిక కార‌ణాల వ‌ల్లే స‌త్‌పాల్ సింగ్ ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటాడ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here