కేంద్ర కారాగారం ఆవ‌ర‌ణ‌లో..ఖైదీ ఆత్మ‌హ‌త్య‌! ఎలా జ‌రిగిందంటూ ఆరా!

ధార్వాడ‌: కేంద్ర కారాగారంలో శిక్ష అనుభ‌విస్తోన్న ఖైదీ ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. కారాగారం ఆవ‌ర‌ణ‌లో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని అత‌ను బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. మృతుడి పేరు ప‌ర‌శురామ్‌. క‌ర్ణాట‌క‌లోని ధ‌ర్వాడ జిల్లా అణ్ణ‌గెరెకు చెందిన ప‌ర‌శురామ్ కొద్దిరోజులుగా కారాగార శిక్ష అనుభ‌విస్తున్నాడు.

 

 

వ‌ర‌క‌ట్నం కోసం భార్య‌ను వేధించిన కేసులో అత‌ను అరెస్ట‌య్యాడు. అత‌నిపై ఆరోప‌ణ‌లు రుజువు కావ‌డంతో జైలు శిక్ష ప‌డింది. మూడునెల‌ల‌ కింద‌టే ప‌ర‌శురామ్ బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు. బెయిల్ వ్య‌వ‌ధి ముగియ‌డంతో మూడురోజుల కింద‌టే అత‌ను మ‌ళ్లీ జైలుకు వ‌చ్చాడు.

 

రాత్రి కారాగారం ఆవ‌ర‌ణ‌లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న కేంద్ర కారాగారం భ‌ద్ర‌తలోని లోపాల‌ను ఎత్తి చూపుతోంది. ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఉన్న‌ప్పటికీ.. వారి క‌ళ్లుగ‌ప్పి.. ప‌ర‌శురామ్ ఆత్య‌హ‌త్య ఎలా చేసుకున్నాడ‌నే అంశంపై అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here