చామరాజ నగర: గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని చామరాజ నగర జిల్లాలో చోటు చేసుకుంది. ఒకేరోజు రెండుసార్లు ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. గురువారం ఉదయం చామరాజ నగర శివార్లలో రైలు కింద పడటానికి ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు.
అతనికి సముదాయించి, వెనక్కి పంపించేశారు. మళ్లీ అదేరోజు సాయంత్రం అతను అదే ప్రాంతంలో రైలు కింద పడి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఎవరు? అతని వివరాలేమిటనేది ఇంకా తెలియరాలేదు.
ఎలాంటి ఆనవాళ్లు కూడా లేకపోవడంతో గుర్తు పట్టడం కష్టతరమౌతోందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై చామరాజ నగర రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.