ఆ బైక్‌లు ఏ రేంజ్‌లో ఢీ కొట్టుకున్నాయంటే..!

ఓ వ్య‌క్తి ప్రాణం పోయేంత వేగంతో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీ కొన్న ఘ‌ట‌న ఇది. తెలంగాణ‌లోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన దుసాలి భూమయ్య సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు నుంచి బైక్‌పై దౌల్తాబాద్ బ‌య‌లుదేరాడు. మార్గ‌మ‌ధ్య‌లో వడ్డెపల్లి గ్రామ శివార్ల‌లో ఎదురుగా అతి వేగంగా వ‌చ్చిన మ‌రో బైక్ ఆయ‌న‌ను ఢీ కొట్టింది.

ఈ ఘ‌ట‌న‌లో భూమ‌య్య సంఘ‌ట‌నాస్థ‌లంలోనే దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. మ‌రో బైక్‌పై వ‌చ్చిన యువ‌కుడిని శంక‌ర‌య్య‌గా గుర్తించారు. అత‌నికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. శంక‌ర‌య్య‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. భూమ‌య్య మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ఆరంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here