అది రీల్‌ సీన్ అయితే..ఇది రియ‌లిస్టిక్ సీన్

బాహుబ‌లి- ద క‌న్‌క్లూజ‌న్‌లో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ ఒక‌టి అద్భుతంగా ఉంటుంది. తొండం ఆధారంగా హీరో ఆ ఏనుగు మీదికి ఎక్కి కుంభ‌స్థలం మీద కూర్చునే సీన్ అది. అది రీల్ సీన్‌. ఆ సీన్ ప‌ర్‌ఫెక్ష‌న్‌గా రావ‌డానికి ద‌ర్శ‌కుడు, స్టంట్ మాస్ట‌ర్‌, హీరో.. చాలా శ్ర‌మ ప‌డి ఉంటారు. అలాంటిదే ఇది కూడా. ఇది మాత్రం రీల్ సీన్ కాదండోయ్‌. రియ‌లిస్టిక్‌.

ఏనుగు తొండం ఆధారంగా దాని మీదికి ఎక్క‌డ‌మే కాదు. కొన్ని అడుగుల పాటు గాల్లోకి ఎగిరి.. మ‌ళ్లీ ఏనుగు మీద నిల‌బడ్డాడో స్టంట్‌మేన్‌. రెనె కాస్లోస్కీ అనే యానిమ‌ల్ ట్రైన‌ర్ ఈ ఫీట్‌ని సాధించారు. ఏనుగు తొండంపై ఎక్కి రెనె చేసిన ఫీట్ క‌ట్టిప‌డేసింది. కొన్నేళ్లుగా అత‌ను ఈ ఫీట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నార‌ట‌. దీనికోసం చాలాసార్లు కింద‌ప‌డి దెబ్బ‌లు త‌గిలించుకున్నాడ‌ని అంటున్నారు.

https://www.instagram.com/p/BioVqftgYar/?taken-by=rene_casselly

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here