తిరుమ‌ల‌లో ప‌ట్ట‌ప‌గ‌లు మందు కొట్టాడు! ఏం చేస్తారో చేసుకోండంటూ స‌వాల్ విసిరాడు.. ఏం చేస్తాం?

ఉత్స‌వాలు, ప్ర‌త్యేక రోజుల్లో శ్రీ‌వారు త‌న దేవేరుల‌తో క‌లిసి ఊరేగే ప‌ర‌మ ప‌విత్ర ప్ర‌దేశం.. తిరుమాడ వీధి. అక్క‌డే తిష్ఠ వేసిన ఓ వ్య‌క్తి.. న‌లుగురూ చూస్తుండ‌గా మందు కొట్టాడు.

ఈ ఘ‌ట‌న వేంక‌టేశ్వ‌రుడి భ‌క్తులను ఆందోళ‌న‌కు గురి చేసిన‌ప్ప‌టికీ.. ఘ‌న‌త వ‌హించిన మ‌న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారుల్లో మాత్రం చ‌ల‌న‌మైనా తీసుకుని రాలేక‌పోయింది.

స్వామివారి సన్నిధిలో, తిరుమాడ వీధుల్లో, టీటీడీ అధికారుల నిర్వ‌హ‌ణా వైఫ‌లం, భ‌ద్ర‌త‌లోని డొల్ల‌త‌నం మ‌ళ్లీ, మ‌ళ్లీ బ‌య‌ట‌ప‌డుతూనే వ‌స్తోంది. ఈ ఘటనపై భక్తులు సమాచారం ఇచ్చినా టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టించుకోలేదు.

పట్టపగలే స్వామివారి సన్నిధిలో దర్జాగా మద్యం సేవించినా చీమ కూడా కుట్టిన‌ట్టు లేదు వారికి. పట్టపగలు అందరూ చూస్తుండగానే మందు తాగాడు. ఎత్తిన బోటిల్ దించ‌కుండా లాగించేశాడు.

ఏం చేస్తారో చేసుకోండంటూ భక్తులకు సవాలు విసిరాడు. మందుబాబు హల్ చల్ చేస్తున్నా విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ‌త మూడేళ్ల కాలంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు త‌ర‌చూ చోటు చేసుకుంటూనే వ‌స్తున్నాయి. మందుబాబులు వీరంగం సృష్టించ‌డం ఇది రెండోసారి. స్వామివారి ఆల‌యం ముందే ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌ద్యం తాగారు.

ఓ ముస్లిం యువ‌కుడు తిరుమ‌ల‌లో న‌మాజ్ కూడా చేశాడు. ఎవ‌రూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఆల‌యం ఎదుట పందులు తిరుగాడితే.. వ‌రాహ అవ‌తార‌మ‌ని స‌రిపెట్టుకున్నాం.

ఇప్పుడూ ఇంతే. పాల‌కుల‌కే ప‌ట్టింపులేన‌ప్పుడు.. మ‌నం చేసేదేముంటుంది? స్వామివారిని ద‌ర్శించుకుని తిరుగుముఖం ప‌ట్ట‌డం త‌ప్ప‌. కాదంటారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here