ఏటీఎంలు ఖాళీ, బ్యాంక్‌కు వెళ్తే మ‌ళ్లీ ర‌మ్మంటోన్న సిబ్బంది! విసుగెత్తి!

ల‌క్నో: జీతం వ‌చ్చి వారం రోజులైంది. ఏటీఎంల‌కు వెళ్తే `నో క్యాష్‌` అంటూ బోర్డులు. బ్యాంకుకు వెళ్తే.. అక్క‌డా క్యాష్ లేద‌ని, మ‌ళ్లీ రావాలంటూ తిప్పుతోన్న సిబ్బంది. దీనితో విసిగి, వేసారి పోయిన ఓ వ్య‌క్తి న‌డుముకు ఏకంగా ఓ బెల్ట్ బాంబు క‌ట్టుకుని బ్యాంకున‌కు వెళ్లాడు. ఆ బెల్ట్ బాంబు డ‌మ్మీ. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని బిజ్నౌర్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఆ వ్య‌క్తి పేరు రోహ‌తాష్‌. జిల్లాలోని చాంద్‌పూర్ నివాసి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చాంద్‌పూర్ శాఖా కార్యాల‌యంలో అత‌నికి అకౌంట్ ఉంది. కొద్దిరోజులుగా డ‌బ్బుల కోసం ఎటీఎంల‌కు వెళ్తున్నాడు. వాటిల్లో న‌గ‌దు ఉండ‌ట్లేదు. నేరుగా బ్యాంకు వ‌ద్ద‌కు వెళ్తే, అక్క‌డా చుక్కెదురైంది. దీనితో విసిగిపోయిన అత‌ను ఓ డ‌మ్మీ బెల్ట్‌బాంబును న‌డుముకు క‌ట్టుకుని బ్యాంక్‌కు వెళ్లాడు.

దోపిడీకి పాల్ప‌డ్డాడు. బ్యాంకులో ఉన్న న‌గ‌దంతా త‌న‌కు ఇవ్వ‌క‌పోతే.. బెల్ట్ బాంబుతో త‌న‌ను తాను పేల్చేసుకుంటాన‌ని బెదిరించాడు. బ్యాంకు సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో.. అత‌ని క‌థ క్లోజైంది. పోలీసులు ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. జైలుకు త‌ర‌లించారు. ఆ వ్య‌క్తికి మ‌తి స్థిమితం లేద‌ని చెబుతున్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here