గుడ్లలో బాహుబలిలా ఉంది.. పగులకొడితే ఏ ముందో అన్న టెన్షన్..!

సాధారణంగా కోడి గుడ్లలో కూడా కొన్ని పెద్దగా.. మరికొన్ని చిన్నగా ఉండడం మనం చూశాం..! కానీ ఇంత భారీ తేడాగా ఉన్న కోడిగుడ్డును చూడడం ఇదే మొదటిసారేమో.. అంతేకాదు మనకందరికీ డౌట్ కూడా వస్తుంది.. ఇది నిజంగా కోడి గుడ్డేనా అని..! ఈ కోడిగుడ్డు ఆస్ట్రేలియా లోని క్వీన్స్ లాండ్ లో ఉన్న స్టాక్ మన్స్ ఎగ్ సెంటర్ లో కనిపించింది.

దీన్ని చూసిన చాలా మంది ఎంతగానో ఆశ్చర్యపోయారు. దాదాపు 176గ్రాముల బరువు ఉందని ఆ షాప్ యజమాని స్కాట్ స్టాక్ మన్ తెలిపాడు. సాధారణంగా ఇలాంటి కోడిగుడ్లు జన్యు లోపం కారణంగా వస్తూ ఉంటాయట. ఒక్కోసారి వీటిని పగులగొడితే ఇందులో ఇంకో కోడిగుడ్డు కూడా ఉండే అవకాశం ఉంది. ఇలాంటిది చాలా అరుదుగా ఏర్పడుతాయి.. ఇక్కడ చూపిస్తున్న ఫోటో గత ఏడాది ఇలా పెద్ద గుడ్డును పగులగొట్టినప్పుడు ఏర్పడ్డదే..!

అయితే ఇప్పుడు ఉన్న కోడి గుడ్డు విషయంలో మాత్రం చాలా మందికి డౌట్ ఉంది. రెండు కోడిగుడ్లు పూర్తిగా కలిపి ఒకేసారి రూపాంతరం చెందాయా అన్నది ఓ డౌట్ అయితే.. సాధారణంగా కోడికి అన్నీ ఒకే భాగం నుండి బయటకు వస్తాయి.. కొంపతీసి అందులో ఏమైనా మలం ఉందా అని కూడా నెటిజన్లు డౌట్ పడుతూ ఉన్నారు.. ఎందుకైనా మంచిది మొదటిదే బెటర్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here