భ‌ర్త కొనిచ్చిన చున్నీతో అత‌ణ్నే హ‌త‌మార్చిన భార్య‌!

హైద‌రాబాద్‌: వివాహేత‌ర సంబంధం మైకంలో ప‌డి క‌ట్టుకున్న భర్త‌ను క‌డ‌తేర్చిందో మ‌హిళ‌. త‌న భ‌ర్త‌ను హ‌త‌మార్చ‌డానికి అత‌ను కొనిచ్చిన పంజాబీ డ్ర‌స్ చున్నీనే ఉరితాడుగా మార్చింది. చున్నీని తాడులా చేసి, వెనుక వైపు నుంచి భ‌ర్త మెడ‌కు ఉరిగా బిగించి చంపేసింది. ఈ దారుణ ఘ‌ట‌న హైద‌రాబాద్ బాలాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

హ‌తుడి పేరు జ‌గ‌దీశ్వ‌ర్‌. అత‌ని భార్య తులసి, ఆమె ప్రియుడు వీర‌బాబు ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టారు. విజయనగరం జిల్లా బాలాజీపేట మండలం పనుకువలసకు చెందిన జ‌గ‌దీశ్వ‌ర్ రావుకు 2012లో సీతాన‌గ‌రం మండ‌లం కొత్త‌వ‌ల‌స‌కు చెందిన తుల‌సితో వివాహ‌మైంది. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు. జీవ‌నోపాధి కోసం ఆ కుటుంబం హైద‌రాబాద్‌కు వ‌ల‌స వ‌చ్చింది.

బాలాన‌గ‌ర్ పారిశ్రామిక‌వాడలోని ఓ ప్రైవేటు సంస్థ‌లో కార్మికుడిగా చేరాడు జ‌గ‌దీశ్వ‌ర్‌. అక్క‌డే అత‌నికి వీర‌బాబు అనే యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం స్నేహంగా మారింది. దీనితో త‌ర‌చూ వీర‌బాబు అత‌ని ఇంటికి వెళ్తుండేవాడు.

ఈ రాక‌పోక‌ల మ‌ధ్య అత‌ను తులసిపై క‌న్నేశాడు. ఆమెతో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. వివాహేత‌ర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ విష‌యం రెండేళ్ల త‌రువాత జ‌గ‌దీశ్వ‌ర్‌కు తెలిసింది. దీనితో అత‌ను వీర‌బాబుతో గొడ‌వ ప‌డేవాడు.

తుల‌సితోనూ త‌ర‌చూ ఘ‌ర్ష‌ణ ప‌డేవాడు. దీనితో వారిద్ద‌రూ క‌లిసి జ‌గ‌దీశ్వ‌ర్‌ను హ‌త్య‌చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కింద‌టి నెల 24వ తేదీన జ‌గ‌దీశ్వ‌ర్‌రావు మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చాడు. అదే స‌మ‌యంలో వీర‌బాబు కూడా జ‌గ‌దీశ్వ‌ర్ ఇంటికి వ‌చ్చాడు. అత‌ణ్ణి చూసిన జ‌గ‌దీశ్వ‌ర్ గొడ‌వ ప‌డ్డాడు.

ఇదే అదునుగా తుల‌సి తాను వేసుకున్న చున్నీతో జ‌గ‌దీశ్వ‌ర్ మెడ‌కు ఉరి బిగించింది. దీనితో అత‌ను కింద‌ప‌డి పోగా వీరబాబు కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నాడు. తులసి చున్నీతో ఉచ్చు బిగించగా ఊపిరాడ‌నివ్వ‌కుండా చంపేసింది.

అనంత‌రం భర్తకు గుండెపోటు వచ్చిందని న‌మ్మించింది. జగదీశ్వర్‌ మృతిపై అనుమానం రావడంతో పోలీసులు స్థానికుల‌తో పాటు అత‌ని తోటి కార్మికులను, తులసిని విచారించ‌డంతో అసలు విషయం బయటపడింది. బాలాన‌గ‌ర్ పోలీసులు వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here