ఏడునెల‌ల గ‌ర్భిణికి విషం పెట్టారు!

ఏడునెల‌ల గ‌ర్భిణికి ఆమె భ‌ర్త‌, అత్తామ‌మ బ‌ల‌వంతంగా విషం పెట్టిన ఘ‌ట‌న ఇది. విష‌ప్ర‌భావానికి లోనైన ఆ గృహిణి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు న‌ళిన‌. ఇంజినీరింగ్ విద్యార్థిని.

జిల్లాలోని హొన్నాళి తాలూకా గోవిన‌కోవి గ్రామానికి చెందిన రాజ‌ప్ప‌, కమ‌ల‌మ్మ‌ల ఒక్క‌గానొక్క కుమార్తె ఆమె. రాజ‌ప్ప గ్రామంలో ఆస్తి ఉంది. ఆ ఆస్తిపై క‌న్నేసిన చేత‌న్ అనే యువ‌కుడు ఆమెను ప్రేమించాడు. ప్రేమ పేరుతో న‌మ్మించి, మోసం చేశాడు. ఈ వ్య‌వ‌హారం అంతా చేత‌న్ ఇంట్లో వారికి తెలుసు.

అయిన‌ప్ప‌టికీ.. వారు త‌మ‌కేమీ తెలియ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. రాజ‌ప్ప దంప‌తుల‌కు తెలియ‌కుండా చేత‌న్.. న‌ళిన‌ను తీసుకెళ్లి మైసూరులో త‌న స్నేహితుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నాడు. త‌మ‌కు తెలియ‌కుండా పెళ్లాడ‌టంతో రాజ‌ప్ప ఆగ్ర‌హించారు. ఆస్తిలో వాటా ఇవ్వ‌బోన‌ని తేల్చిచెప్పారు.

ఈ విష‌యం తెలిసిన త‌రువాత చేత‌న్ త‌న అస‌లు స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టాడు. ఆస్తి ఇవ్వాల్సిందేనంటూ న‌ళిన‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేసేవాడు. త‌న భ‌ర్త వైఖ‌రిని తెలుసుకున్న న‌ళిన‌.. త‌న ఇబ్బందులు, బాధ‌ల‌ను త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డింది.

దీనితో మ‌రింత రెచ్చిపోయిన చేత‌న్‌.. ఏడు నెల‌ల గ‌ర్భిణి అని కూడా చూడ‌కుండా విషం పెట్టాడు. విష‌ప్ర‌భావానికి గురైన న‌ళిన ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది. ఈ ఘ‌ట‌న‌పై చేత‌న్‌, అత‌ని త‌ల్లి ల‌త‌, తండ్రి హాల‌ప్ప‌ల‌పై కుంసి పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here