మ‌ల‌ద్వారంలో గాజు గోలి..తీయ‌డానికి రెండు గంట‌లు ప‌ట్టింది!

మ‌నం చిన్న‌ప్పుడు గోలీలాట ఆడుకునే వాళ్లం క‌దా! అలాంటి వాటిల్లో పెద్ద సైజు గోలి ఒక‌టి ఓ వ్య‌క్తి మ‌ల‌ద్వారంలో ఇరుక్కుంది. సుమారు మూడున్న‌ర ఇంచుల సైజులో ఉండే గోలీ అది. అది కాస్త పెద్ద పేగుల చివ‌రి భాగంలో ఉండే `రెక్ట‌మ్‌`లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. దీని ఫ‌లితం ఏమిటంటే.. మ‌లం రాక తెగ ఇబ్బందులు ప‌డ్డాడు.

రెక్ట‌మ్ నుంచి ఆ గోలీని తొల‌గించ‌డానికి రెండు గంట‌ల‌ పాటు డాక్ట‌ర్లు శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌టన చైనాలో చోటు చేసుకుంది. చైనా గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని డాన్గున్ అనే ప‌ట్ట‌ణానికి చెందిన గ్జియావో మింగ్ అనే 31 సంవ‌త్స‌రాల వ్య‌క్తి పొత్తి క‌డుపులో తీవ్ర నొప్పితో ఆసుప‌త్రికి వెళ్లాడు.

అక్క‌డ ఎక్స్ రే తీసి చూడ‌గా.. మ‌ల‌ద్వారం లోప‌లి భాగంలో ఉండే రెక్ట‌మ్‌లో గాజు గోలీ క‌నిపించింది. వెంట‌నే ఆప‌రేష‌న్ చేసి దాన్ని తొల‌గించారు. ఆ గోలీ అత‌ని రెక్ట‌మ్‌లోకి ఎలా వెళ్లింద‌నే విష‌యాన్ని మింగ్ వెల్ల‌డించ‌ట్లేదు. ఎలాగోలా వెళ్లింది గానీ.. ముందు బ‌య‌టికీ తీయండంటూ ఆయ‌న డాక్ట‌ర్ల‌ను ప్రాధేయ‌ప‌డ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here