తైపీ: తన కామవాంఛ తీర్చుకోవడానికి సెక్స్‌టాయ్‌ను ఆశ్రయించాడో యువకుడు. ఎనిమిది అంగుళాల పొడవున్న తీగలాంటి సెక్స్టాయ్ అది. దాన్ని తన మర్మాంగానికి అమర్చుకోవడానికి ప్రయత్నించాడు. పొరపాటున అది మూత్రనాళం (బ్లాడర్)లోకి వెళ్లింది. అక్కడే ఇరుక్కుపోయింది. దీనితో బావురుమంటూ ఆ యువకుడు ఆసుపత్రికి పరుగెత్తాల్సి వచ్చింది.
సున్నితమైన భాగాల్లో ఆ సెక్స్టాయ్ ఇరుక్కుపోవడం వల్ల అప్పటికప్పుడు దాన్ని తీయడానికి వీల్లేదని చెప్పిన డాక్టర్లు.. ఆపరేషన్ చేయడానికి 48 గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.
ఈ ఘటన తైవాన్‌లోని కవ్హోషియెంగ్ సిటీలో చోటు చేసుకుంది. ఆ యువకుడి పేరు తెలియరావట్లేదు. 30 సంవత్సరాల ఆ యువకుడికి ఇంకా పెళ్లి కాలేదు. సెక్స్ టాయ్లకు అలవాటు పడ్డాడు. బుడిపెలు ఉన్న ఎనిమిది అంగుళాల ఓ సెక్స్‌టాయ్‌ను ఇటీవలే కొన్నాడు. దాన్ని అమర్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా అది పొరపాటున మూత్రనాళంలో ఇరుక్కుపోయింది. ఆ వెంటనే అతను బాత్రూమ్కు వెళ్లగా మూత్రంతో పాటు రక్తం కూడా వచ్చింది.
దీనితో అతను వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు. `యురెథ్రా ప్లే` కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ టాయ్ మూత్రనాళంలోకి వెల్లిందని వివరించాడు. అనంతరం అతనికి క్రిస్టోస్కోపీ పరీక్షలను నిర్వహించారు డాక్టర్లు.
సున్నితమైన భాగంలో చిక్కుకుపోవడం వల్ల అప్పటికప్పుడు ఆపరేషన్ చేస్తే ప్రమాదమని గుర్తించారు. 48 గంటల తరువాత యురాలజీ స్పెషలిస్ట్ జియాన్ బ్యాంగ్పింగ్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి దాన్ని బయటికి తీశారు.