ప‌దేళ్ల త‌రువాత ప‌దో త‌ర‌గ‌తి క్లాస్‌మేట్ న‌గ్న ఫొటోల‌తో బ్లాక్‌మెయిల్‌..!

హైద‌రాబాద్‌: ఎప్పుడో ప‌దేళ్ల కింద‌ట క‌లిసి తిరిగిన స్నేహితురాలి న‌గ్న ఫొటోల ద్వారా ఆమెను ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేస్తోన్న ప్ర‌బుద్ధుడిని షి టీమ్స్ పోలీసులు క‌ట‌క‌టాల వెన‌క్కి నెట్టారు. ఇప్పుడామె వివాహిత. త‌న‌ను కాకుండా వేరొక‌రిని పెళ్లి చేసుకుంద‌నే ఆక్క‌సుతో నిందితుడు ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు పోలీసులు తెలిపారు.

 

ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంది. నిందితుడి పేరు ర‌వి. తెలంగాణ‌లోని జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండలంలోని ప‌ల్లెపాడు అత‌ని స్వ‌గ్రామం. అదే గ్రామంలో అత‌ను ప‌దో త‌ర‌గ‌తి చ‌దివాడు. ఆ స‌మ‌యంలో ప‌ల్లెపాడుకే చెందిన బాలిక ప‌రిచ‌యమైంది. ఆమెతో చ‌నువుగా ఉండేవాడు. ప్రేమించాల‌ని వెంట‌ప‌డేవాడు. అతని ప్రేమ‌ను ఆమె నిరాక‌రించింది.

 

2014లో ఆమెకు వివాహ‌మైంది. ఇద్ద‌రు పిల్ల‌లు కూడా. పెళ్లి త‌రువాత ఆమె భ‌ర్త‌, పిల్ల‌ల‌తో క‌లిసి హైద‌రాబాద్ మీర్‌పేట్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో నివాసం ఉంటోంది. ర‌విని దాదాపు మ‌రిచిపోయింది. గ‌త ఏడాది ర‌వి ఆమె ఫోన్ నంబ‌ర్‌ను సంపాదించాడు. రోజూ ఆమెకు ఫోన్ చేసి వేధిస్తుండేవాడు. త‌న‌ను పెళ్లి చేసుకోనందుకు ప‌గ తీర్చుకుంటాన‌ని బెదిరిస్తుండేవాడు.

ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుకునే స‌మ‌యంలో ఆమెకు తెలియ‌కుండా తీసిన నగ్న ఫొటోల‌ను బాధితురాలి వాట్స‌ప్‌కు పంపించాడు. వాటిని యూట్యూబ్‌లో పెడతానని, సోషల్‌ మీడియాలోనూ పోస్ట్‌ చేస్తానని, ఆమె భర్తకు పంపిస్తానని బెదిరించాడు. ఆమె నుంచి రెండున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను కూడా గుంజాడు.

దీనికి భ‌య‌ప‌డిన ఆమె ఆ ఫొటోల‌ను డిలిట్ చేయాల‌ని కోరగా.. కల్వకుర్తి హనుమాన్‌ టెంపుల్‌ వద్దకు రావాల‌ని, అక్కడ ఫోన్‌లోని ఫొటోలు, డిలీట్‌ చేస్తానని జ‌న‌వ‌రి 18వ తేదీన ఫోన్ చేశాడు. అత‌ని మాట‌ల‌ను న‌మ్మిన ఆమె క‌ల్వ‌కుర్తికి వెళ్ల‌గా.. ఆమెపై ర‌వి అత్యాచారం చేశాడు. అత్యాచార స‌మ‌యంలోనూ ఫొటోలు తీశాడు.

అప్పట్నుంచి వేధింపులు మ‌రింత ఎక్కువ అయ్యాయి. దీనితో ఆమె షీటీమ్‌ను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనం, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here