పెళ్లంటూ చేసుకుంటే స‌చిన్ కూతుర్నే చేసుకుంటా: లేదంటే కిడ్నాప్ చేస్తానంటూ ఒకేరోజు 20కి పైగా ఫోన్‌కాల్స్‌..

మాజీ క్రికెట‌ర్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు స‌చిన్ టెండుల్క‌ర్ కుమార్తె సారాను కూడా వ‌ద‌ల్లేదు ఓ వ్య‌క్తి. త‌న‌ను ప్రేమించ‌క‌పోతే కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపు ఫోన్‌కాల్స్ చేశాడు.

ఒకేరోజు 20కి పైగా ఫోన్‌కాల్స్ వ‌చ్చాయి సారా టెండుల్క‌ర్‌కు. మొద‌ట మొబైల్‌ఫోన్‌కు, దాన్ని లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో ల్యాండ్ లైన్‌కూ ఫోన్లు చేసి వేధించాడు.

దీనిపై స‌చిన్ టెండుల్క‌ర్ బాంద్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు యుద్ధ ప్రాతిప‌దిక‌న ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు. ఫోన్‌కాల్స్ లొకేష‌న్ ఆధారంగా అత‌ణ్ణి గుర్తించారు.

అత‌ని పేరు దేబ్‌కుమార్ మేతి. 32 సంవ‌త్స‌రాల దేబ్‌కుమార్ ప‌శ్చిమ బెంగాల్ ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని మ‌హిషాద‌ల్ గ్రామానికి చెందిన వ్య‌క్తిగా పోలీసులు తెలిపారు.

సారా టెండుల్క‌ర్‌ను తాను మొద‌టిసారిగా టీవీలో చూశాన‌ని, పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాన‌ని దేబ్‌కుమార్ పోలీసుల స‌మ‌క్షంలో వెల్ల‌డించాడు. స‌చిన్ టెండుల్క‌ర్ ఇంటి ల్యాండ్‌లైన్ నంబ‌ర్ ఎలా సంపాదించాడ‌నే విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here