చెప్పులు ధ‌రించి, శివ‌లింగంపై మోకాలు పెట్టి.. ఫొటోకు ఫోజు!

చెన్నై: ప‌ర‌మ ప‌విత్రంగా భావించే శివ‌లింగంపై మోకాలు పెట్టి ఫొటోకు ఫోజిచ్చాడో వ్య‌క్తి. పైగా చెప్పులు కూడా ధ‌రించి ఉన్న‌ట్టు ఫొటోలో క‌నిపిస్తోంది. ఈ స్టిల్‌ను ఆ యువ‌కుడు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ కాస్సేప‌టికే కామెంట్ల వెల్లువ మొద‌లైంది. దీనిపై ప‌లువురు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు.

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న మ‌రో వ్య‌క్తి కోసం గాలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని మామ‌ళ్లాపురంలో చోటు చేసుకుంది. నిందితుడి పేరు స‌ద్దాం హుస్సేన్‌. కాంచీపురం జిల్లా తిరుకాజుకుండ్రం గ్రామానికి చెందిన వ్య‌క్తి. త‌న స్నేహితుల‌తో క‌లిసి కొద్దిరోజుల కింద‌ట మ‌హాబ‌లిపురానికి వెళ్లాడు.

పాదరక్షలతోనే గుడిలోకి వెళ్లి, అక్క‌డి శివలింగంపై మోకాలు పెట్టి ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.

తమ మత విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు హిందూత్వవాదులు, మున్నాయ్ హిందూ గ్రూపు మమళ్లాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సద్దాం హుస్సేన్ చెంగ‌ల్ప‌ట్టు సబ్ జైలులో ఉన్నాడు. ఆ ఫొటోలో సద్దాం పక్కన ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here