క‌ట్టుకున్న భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన భ‌ర్త‌!

భువ‌నేశ్వ‌ర్‌: స‌రిగ్గా తొమ్మిదిరోజుల కింద‌టే పెళ్లి చేసుకున్న ఓ యువ‌కుడు త‌న భార్య‌ను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన ఘ‌ట‌న ఇది. క‌ట్టుకున్న భార్య త‌న ప్రియుడితో.. త‌న ఇంట్లోనే శృంగారంలో పాల్గొన్న దృశ్యం కంట ప‌డేస‌రికి ఆగ్ర‌హంతో రగిలిపోయిన ఆ యువ‌కుడు.. అత‌నికే ఇచ్చి అప్ప‌టిక‌ప్పుడు పెళ్లి చేశాడు.

ఈ ఘ‌ట‌న ఒడిశాలోని సుంద‌ర్‌గ‌ఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ భ‌ర్త పేరు బాసుదేవ్ టోప్పో. 24 సంవ‌త్స‌రాల బాసుదేవ్ జిల్లాలోని కృష్ణ‌పాడా గ్రామ నివాసి. ఝార్సుగూడ జిల్లాకు చెందిన యువ‌తిని అత‌ను ఈ నెల 4వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. బంధుమిత్రుల సమ‌క్షంలో తాళి క‌ట్టాడు. ఆమెను కాపురానికి తీసుకొచ్చాడు.

పెళ్లికి ముందు ఆ యువ‌తి సుశీల్ ప్ర‌ధాన్ అనే యువ‌కుడిని ప్రేమించింది. పెళ్లి త‌రువాత కూడా ఆమె త‌న ప్రియుడిని మ‌రిచిపోలేక‌పోయింది. పెళ్లయిన వారంరోజుల త‌రువాత సుశీల్ ప్ర‌ధాన్ ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి బాసుదేవ్ ఇంటికి వెళ్లాడు. ఈ సంద‌ర్భంగా ఆ యువ‌తి సుశీల్‌కుమార్‌ను ద‌గ్గ‌రి బంధువుగా ఇంట్లో వారికి ప‌రిచ‌యం చేసింది.

బాసుదేవ్ ఇంట్లో లేని స‌మ‌యంలో సుశీల్‌ప్ర‌ధాన్‌.. అత‌ని భార్య‌తో సెక్స్‌లో పాల్గొన్నాడు. ఇది కుటుంబ స‌భ్యుల కంట్లో ప‌డింది. దీనితో వారు స్థానికుల స‌హాయంతో సుశీల్ ప్ర‌ధాన్‌, అత‌ని స్నేహితుల‌ను స్తంభానికి క‌ట్టేసి కొట్టారు. బాసుదేవ్‌కు స‌మాచారం ఇచ్చారు. ఈ విష‌యం తెలుసుకున్న వెంట‌నే బాసుదేవ్ ఇంటికి చేరుకున్నారు. ఇద్ద‌ర్నీ గుడికి తీసుకెళ్లి అక్క‌డిక‌క్క‌డే పెళ్లి చేశాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here