బాబు బాగా కన్నింగ్.. ముగ్గురు భార్యలు.. వారంతా ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ అవ్వడంతో..!

ఈ వ్యక్తి ఎంత కన్నింగ్ అంటే.. మనమే ఒక మంచి స్టోరీ రాసుకొని సినిమా కూడా తీసేయొచ్చు.. మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతగానో నటించాడు. ఏమీ తెలియనట్లు.. బిజినెస్ చేస్తున్నట్లు చెప్పి ఒక్కరికి తెలీకుండా ఒకరితో ఉండడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏమి జరిగిందంటే ఇతగాడి ముగ్గురు భార్యలు ఫేస్ బుక్ లో పరిచయం చేసుకున్నారు ఒకరినొకరు. ఇంతకూ మీరు అతడికి ఏమవుతారు.. ఏమవుతారు అని అడిగితే.. అందరూ భార్యలే అని చెప్పుకున్నారు. అంటే ముగ్గురు భార్యలను పెళ్ళి చేసుకొని ఒకరి గురించి మరొకరికి తెలియకుండా ఇన్నాళ్ళూ గడిపాడు.. ఫేస్ బుక్ లో ముగ్గురూ కనెక్ట్ అవ్వడంతో అడ్డంగా దొరికిపోయాడు.

రాజస్థాన్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ఈ పని చేశాడు. అఫ్సా అనే ఉత్తరప్రదేశ్ మహిళ తన భర్త సమీర్ తొమ్మిది పెళ్ళిళ్ళు చేసుకున్నాడని.. తాను ఏడో భార్యను అని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అక్కడ జరిగింది ఏమిటంటే ఇతడు తొమ్మిది పెళ్ళిళ్ళు చేసుకోలేదు..! జస్ట్ మూడు పెళ్ళిళ్ళు మాత్రమే చేసుకున్నాడు.

అఫ్సా కు ముందు నుండి తన భర్త మీద అనుమానం ఉండేది.. ఆమెను తన ఫోన్ ను ముట్టుకోనిచ్చేవాడు కాదు సమీర్..! అతడికి నేహా అనే మరో మహిళ ఫోన్ చేసేది.. ఒకరోజు సమీర్ ఫోన్ ను తీసుకొని నేహాకు ఫోన్ చేసింది. అయితే ఆమె మాత్రం తనను పెళ్ళి చేసుకోలేదని చెప్పుకొచ్చింది. కానీ అఫ్సాకు భర్త మీద అనుమానం అలాగే ఉంది. అతడి అకౌంట్ లో నుండి పలు మార్లు కొందరికి డబ్బులు వెళ్ళడం కూడా అఫ్సా గమనించింది. ఈ సమయంలో అఫ్సాకు యాస్మిన్ అనే యువతి దగ్గర నుండి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తెలిసింది ఏమిటంటే.. ఆమెను కూడా సమీర్ పెళ్ళి చేసుకున్నాడట. ఇద్దరూ చాలా విషయాలను చర్చించుకోగా.. సమీర్ ఇన్నాళ్ళూ మనల్ని మోసం చేస్తూ వచ్చాడని గుర్తించారు. నేహా కూడా సమీర్ పెళ్ళి చేసుకున్న అమ్మాయే అని గమనించారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. పోలీసులు అతన్ని ఇంటరాగేషన్ చేయగా.. తాను మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది నిజమేనని చెప్పుకొచ్చాడు. నేహాకూ తనకు ముగ్గురు పిల్లలని కూడా ఒప్పేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here