ప‌క్కింటావిడ‌తో పేచీ..తుపాకీతో కాల్చి..!

మ‌డికెరి: ప‌క్కింటావిడ‌తో ఓ చిన్న పేచీ కార‌ణంగా మృగంగా మారాడో వ్య‌క్తి. త‌న వ‌ద్ద ఉన్న నాటు తుపాకీని తీసుకుని ఆమెపై కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో ఆమె అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించింది. అనంత‌రం తానూ ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు.

బుల్లెట్ గాయాల‌తో ర‌క్తమోడుతున్న అత‌ణ్ని స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ అత‌ను మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని కొడ‌గు జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు ల‌లిత‌. నిందితుడి పేరు ధ‌ర్మారాయ‌.

మ‌డికెరి తాలూకాలోని కాలూరు గ్రామంలో వారిద్ద‌రి నివాసాలూ ప‌క్క‌ప‌క్క‌నే ఉంటాయి. ధ‌ర్మారాయ‌, ల‌లిత మ‌ధ్య చాన్నాళ్ల నుంచి ప‌రిచ‌యం కూడా ఉంది. ఇద్ద‌రూ ప‌క్కింటి వారే కావ‌డంతో స‌త్సంబంధాలు కూడా ఉన్నాయి.

కొద్దిరోజులుగా ఇద్ద‌రి మ‌ధ్యా చిన్న విష‌యంపై గొడ‌వ చెల‌రేగింది. అది అంత‌కంత‌కూ పెరిగి, పెద్ద‌దైంది. త‌ర‌చూ గొడ‌వ ప‌డుతుండేవారు. శుక్ర‌వారం కూడా ఇద్ద‌రి మ‌ధ్య త‌గాదా చోటు చేసుకుంది. రెండు కుటుంబాలూ ఘ‌ర్ష‌ణ ప‌డ్డాయి.

ఈ నేప‌థ్యంలో తీవ్ర ఆవేశానికి గురైన ధ‌ర్మారాయ త‌న వ‌ద్ద ఉన్న నాటు తుపాకీతో ల‌లిత‌పై కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో రెండు బుల్లెట్లు ల‌లిత శ‌రీరంలోకి దూసుకెళ్లాయి. దీనితో ఆమె సంఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌ర‌ణించారు.

అనంత‌రం అదే ఆవేశంతో ధ‌ర్మారాయ కూడా త‌న‌ను తాను కాల్చుకున్నాడు. త‌ల‌పై కాల్చుకోవ‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. కుటుంబ స‌భ్యులు అత‌ణ్ణి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న‌పై మ‌డికెరి రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here