ఆలిని చంపి, తాళిని కూడా తెంపుకెళ్లాడు!

విజ‌య‌పుర‌: మ‌ద్యం మ‌త్తులో దారుణానికి పాల్ప‌డ్డాడో వ్య‌క్తి. ఒంటిమీద ఉన్న బంగారం కోసం క‌ట్టుకున్న భార్య‌ను క‌డ‌తేర్చాడు. గొంతు నులిమి హ‌త‌మార్చాడు.

తాళి బొట్టును కూడా తెంపుకెళ్లాడు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌పుర జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు సిద్ధ‌మ్మ సంగ‌ఠాణ. వ‌య‌స్సు 24 సంవ‌త్స‌రాలే.

జిల్లాలోని సింద‌గి తాలూకా బంక‌ల‌గి గ్రామంలో భ‌ర్త బ‌స‌వ‌రాజ్‌తో క‌లిసి నివ‌సిస్తుండేది. మూడేళ్ల కింద‌టే ఆమెకు పెళ్ల‌యింది. బ‌స‌వ‌రాజ్ మ‌ద్యానికి బానిస‌.

తాగందే ఏ ప‌నీ చేయ‌లేడు. అర‌కొర సంపాద‌న‌ను మ‌ద్యానికే త‌గ‌లెట్టేవాడు. దీనితో త‌ర‌చూ భార్య‌భ‌ర్త మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకుంటుండేది.

ఆదివారం రాత్రి కూడా మ‌ద్యానికి డ‌బ్బు కోసం భార్య‌తో గొడ‌వ ప‌డ్డాడు బ‌స‌వరాజ్‌. ఇద్ద‌రి మ‌ధ్యా తీవ్ర వాగ్వివాదం చెల‌రేగింది. ఆగ్ర‌హంతో బ‌స‌వ‌రాజ్ భార్య గొంతు నులిమి హ‌త‌మార్చాడు.

అనంత‌రం.. ఆమె ఒంటిపై తాళిబొట్టు, ముక్కుపుడ‌క‌, చెవి క‌మ్మ‌లను దోచుకుని పారిపోయాడు. దీనిపై సింద‌గి పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. బ‌స‌వ‌రాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here