రాత్రి భార్యా బిడ్డ‌ల‌కు మ‌ట‌న్ బిర్యానీ తినిపించాడు..తెల్లవారు ఝామున గొంతు నులిమి చంపాడు

హైద‌రాబాద్‌: న‌గ‌రంలో మ‌రో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది. ఓ దుర్మార్గ‌పు భ‌ర్త త‌న భార్య‌, ఇద్ద‌రు ముద్దులొలికే చిన్నారుల‌ను గొంతు నులిమి హ‌త‌మార్చాడు.

ఆ త‌రువాత నేరుగా పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ జిల్లెల‌గూడ‌లో చోటు చేసుకుంది. మృతుల పేర్లు జ్యోతి, అభితేజ్‌, స‌హ‌స్ర‌.

జ్యోతి వ‌య‌స్సు 33 సంవ‌త్స‌రాలు కాగా.. అభితేజ్‌కు ఆరేళ్లు, స‌హ‌స్ర‌కు నాలుగేళ్లు. క‌ట్టుకున్న వాడే భార్య‌, పిల్ల‌ల‌ను చంపేశాడు.

హ‌రీంద‌ర్ అనే వ్య‌క్తి కొన్నేళ్లుగా జిల్లెల‌గూడ‌లోని సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నాడు. భార్య జ్యోతితో కొద్దిరోజులుగా మ‌న‌స్ప‌ర్థ‌లు ఉన్నాయ‌ని, ఇద్ద‌రూ కుటుంబ సంబంధ గొడ‌వ‌ల వ‌ల్ల ఘ‌ర్ష‌ణ ప‌డుతుండేవార‌ని బంధువులు చెబుతున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకునే హ‌రీంద‌ర్ భార్యా, పిల్ల‌ల‌ను హ‌త‌మార్చి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. ముందురోజు రాత్రి వారికి బిర్యానీ కూడా తినిపించాడ‌ని అంటున్నారు.

తెల్ల‌వారు జామున గొంతు నులిమి హ‌త‌మార్చిన త‌రువాత నేరుగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here