స‌ర‌దాగా తిరిగొద్దామంటూ భార్య‌ను రాతి గ‌నుల వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు..200 అడుగుల గ‌నిలో తోశాడు!

భార్య‌పై అనుమానంతో ఓ వ్య‌క్తి దారుణానికి ఒడిగ‌ట్టాడు. భార్య‌కు మాయ‌మాట‌లు చెప్పి రాతి గ‌నుల వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. 200 అడుగుల లోతు ఉన్న గ‌నిలోకి తోసేశాడు. అంత ఎత్తులో నుంచి కింద ప‌డిన ఆమె ప్రాణాలు బ‌హుశా కింద‌ప‌డ‌క ముందే గాల్లో క‌లిసి పోయి ఉంటాయి.

ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బ‌హోడాపూర్ స‌మీపంలోని ల‌క్ష్మీపూర్ గ్రామానికి చెందిన హీనా ఖాన్‌కు మూడు నెల‌ల కింద‌ట బారాగావ్‌కు చెందిన ర‌షీద్ ఖాన్‌తో వివాహ‌మైంది.

పెళ్ల‌యిన‌ప్ప‌టి నుంచీ ర‌షీద్‌కు త‌న భార్య‌ను అనుమానిస్తుండేవాడు. ల‌క్ష్మీపూర్‌కు చెందిన ఓ యువ‌కుడితో అక్ర‌మ సంబంధం ఉంద‌ని అనుమానించేవాడు. ఈ అనుమానంతోనే భార్య‌ను మ‌ట్టుబెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

ఆదివారం సాయంత్రం ఆమెను త‌న బైక్‌పై ఎక్కించుకుని త‌న గ్రామ శివార్ల‌లో ఉన్న రాతి గ‌నుల వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. అక్క‌డ 200 అడుగుల లోతు ఉన్న గ‌నిలోకి తోసేశాడు. ఏమీ తెలియ‌న‌ట్టు ఇంటికెళ్లాడు.

హీనాఖాన్ తండ్రి ష‌మీమ్ ఖాన్ త‌న కుమార్తెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పంద‌న రాక‌పోవ‌డంతో ఆందోళ‌న‌కు గుర‌య్యాడు. త‌న ద‌గ్గ‌రి బంధువుతో క‌లిసి బారాగావ్‌కు బ‌య‌లుదేరాడు. మార్గ‌మ‌ధ్య‌లో రాతి గ‌నుల వ‌ద్ద హీనాఖాన్ చెప్పులు క‌నిపించాయి.

దీనితో అక్క‌డ వెత‌గ్గా.. ఆమె మృత‌దేహం ఛిద్ర‌మైపోయి క‌నిపించింది. దీనితో బావురుమ‌న్న ష‌మీమ్ ఖాన్ బ‌హోడాపూర్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు హీనాఖాన్ మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

త‌న అల్లుడే ఈ దారుణానికి పాల్ప‌డి ఉంటారంటూ ష‌మీమ్‌ఖాన్ అనుమానం వ్య‌క్తంచేశారు. దీనితో పోలీసులు ర‌షీద్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. అనుమానం వ‌ల్లే హీనాఖాన్‌ను తానే హ‌త‌మార్చిన‌ట్టు ర‌షీద్ ఖాన్ పోలీసుల ద‌ర్యాప్తులో అంగీక‌రించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here