ఒక్క రూపాయి కోసం ప్రాణం తీశారు..!

ఒకే ఒక్క రూపాయి కోసం జరిగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చిన్న గొడవ కాస్తా చివరికి చంపుకునేలా చేసింది. మహారాష్ట్ర లోని కళ్యాణ్ కు చెందిన 54 ఏళ్ల వ్యక్తి ఒక్క రూపాయి కోసం జరిగిన గొడవలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మనోహర్ గామ్నే అనే 54 సంవత్సరాల వ్యక్తి తన ఇంటి నుండి బయటకు వచ్చాడు. ఇంటి ముందు ఉన్న షాప్ లో కోడిగుడ్లు కొనుకున్నాడు. ఆ షాప్ అమ్మిన వ్యక్తికి మనోహర్ ఒక్క రూపాయి తక్కువగా ఇచ్చాడు. దీంతో వారి మధ్య గొడవ మొదలైంది. అంగడిలో ఉన్న వ్యక్తి మనోహర్ ను బూతులు తిట్టాడు. ఇద్దరూ మాట మాట అనుకొని గొడవ పెద్దదైంది. ఇంతలో షాప్ ఓనర్ కొడుకు అక్కడకు చేరుకున్నాడు. మా నాన్ననే తిడతావా అని మనోహర్ పై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో మనోహర్ కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్ళగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. ఈ ఘటనలో సుధాకర్ ప్రభును పోలీసులు అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here