చెల్లిని..వందేళ్ల నాయ‌న‌మ్మ‌ను కాల్చి చంపాడు!

లాహోర్‌: త‌న చెల్లెలు ప్రేమ‌లో ప‌డింద‌నే ఒకే ఒక్క కార‌ణంతో ఆమె సోద‌రుడు రాక్ష‌సుడిగా మారాడు. చెల్లెలు, వందేళ్ల నాయ‌న‌మ్మ‌ను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో యువ‌తి తీవ్రంగా గాయ‌ప‌డింది. ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్ర‌న్‌వాలా సిటీలో ఆదివారం ఉదయం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

దీన్ని ప‌రువు హ‌త్య‌గా భావిస్తున్నారు పోలీసులు. నిందితుడి పేరు సూఫియాన్‌. సూఫియాన్ త‌న త‌ల్లిదండ్రులతో క‌లిసి గుజ్ర‌న్‌వాలా సిటీలో నివ‌సిస్తున్నాడు. అత‌నికి ఇక్రా, స‌న అనే ఇద్ద‌రు చెల్లెళ్లు. త‌న చెల్లెలు ఇక్రా ఓ యువ‌కుడికి ప్రేమిస్తున్న‌ట్టు తెలియ‌డంతో ఆదివారం ఉద‌యం ఆమెతో గొడ‌వ ప‌డ్డాడు.

తాను ఎవ‌ర్నీ ప్రేమించ‌ట్లేద‌ని ఆమె చెబుతున్న‌ప్ప‌టికీ.. వినిపించుకోలేదు. ఆమెను కొట్టాడు. ఆ స‌మ‌యంలో ఇంట్లోనే ఉన్న సూఫియాన్ నాయ‌న‌మ్మ బ‌షీరా బీబీ అడ్డు ప‌డ్డారు. ఆమెకు వందేళ్లు. ఇటీవ‌లే వందో పుట్టిన‌రోజును కూడా జ‌రిపారు.

వారు అడ్డు ప‌డ‌టంతో మ‌రింత రెచ్చిపోయిన సూఫియాన్ తుపాకీతో ముగ్గురిపైనా కాల్పులు జ‌రిపి, పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇక్రా, బ‌షీరాబీబీ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. స‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌న‌ను ప‌రువు హ‌త్య‌గా భావిస్తున్నారు. పారిపోయిన సూఫియాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here