హోలీ పండ‌క్కి కుమార్తె, మ‌న‌వ‌డిని తీసుకెళ్ల‌డానికొచ్చిన త‌ల్లిదండ్రులు! గుప్పుమంటూ సోకిన దుర్వాస‌న‌!

భ‌ద్ర‌క్‌: క‌ట్టుకున్న భార్య‌ను, క‌న్న కొడుకును దారుణంగా చంపి, ఇంట్లోనే పాతిపెట్టాడో కిరాత‌కుడు. వారిని చంప‌డానికి గ‌ల కార‌ణం కూడా చాలా చిన్న‌దేన‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘ‌ట‌న ఒడిశాలోని భ‌ద్ర‌క్ జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని మాఝీ సాహి గ్రామానికి చెందిన జితేన్ సాహు (పేరుమార్చాం) కింద‌టి నెల 24వ తేదీన త‌న భార్య‌, కుమారుడిని హ‌త‌మార్చాడు. వారి మృత‌దేహాల‌ను మాయం చేశాడు. పూరి గుడిసెలో పాతిపెట్టాడు. హోలీ పండుగ కోసం కుమార్తె, మ‌న‌వ‌డిని త‌మ ఇంటికి తీసుకెళ్ల‌డానికొచ్చారు త‌ల్లిదండ్రులు.

 

వారిని ఇంటి వ‌ర‌కూ రాకుండా అడ్డుకున్నాడు జితేన్‌. ఆ త‌రువాత వారు ఇంట్లో అడుగు పెట్ట‌గా దుర్వాస‌న సోకింది. దీనితో వారు అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు. త‌మ కుమార్తె, మ‌న‌వ‌డు ఏడీ అంటూ నిల‌దీశారు.

ఈ విష‌యాన్ని చుట్టుప‌క్క‌ల వారికి తెలియ‌జేశారు. త‌మ కుమార్తె నాలుగురోజుల నుంచి క‌నిపించ‌ట్లేదంటూ చెప్పారు. గ్రామ‌స్తులు ధూసురి పోలీస్‌స్టేష‌న్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు దుర్వాస‌న వ‌చ్చిన చోట త‌వ్వ‌గా ఇద్ద‌రి మృత‌దేహాలు వెలుగు చూశాయి. క్షణికావేశంలో తానే వారిని హ‌త‌మార్చిన‌ట్లు జితేన్ అంగీక‌రించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here