పుట్టింటికి పంపిస్తాన‌ని న‌మ్మించి, రైల్వేస్టేష‌న్‌కు తీసుకెళ్లి, రైలు కింద తోసి!

పాట్నా: భార్య‌ను అత్త‌గారింటికి తీసుకెళ్తాన‌ని న‌మ్మించి స్టేష‌న్‌కు తీసుకొచ్చిన ఓ భ‌ర్త, ఆమెను రైలు కింద తోసి చంపిన ఉదంతం ఇది. బిహార్ రాజ‌ధాని పాట్నా స‌మీపంలోని గుల్జాబార్గ్ రైల్వే స్టేష‌న్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. హ‌తురాలి పేరు ఆశా దేవి. ఆమె భ‌ర్త పేరు సునీల్ ప్ర‌సాద్. వైమానిక ద‌ళ ఉద్యోగి. పాట్నా శివార్ల‌లో నివాసం ఉంటున్నారు.

పుట్టింటికి వెళ్తానంటూ కొద్దిరోజులుగా ఆశాదేవి కోరుతుండ‌టంతో మంగ‌ళ‌వారం సాయంత్రం సునీల్ ప్ర‌సాద్ ఆమెను వెంట‌బెట్టుకుని బైక్‌పై గుల్జార్‌బాగ్ రైల్వేస్టేష‌న్‌కు వ‌చ్చాడు. ప్లాట్‌ఫాంపై నిల్చుని మాట్లాడుతూ.. స్టేష‌న్‌లోకి ప్ర‌వేశించిన ఓ ఎక్స్‌ప్రెస్ రైలు కిందికి ఆమెను తోసివేశాడు. ఏ మాత్రం ఊహించ‌ని ఈ ఘ‌ట‌న నుంచి తేరుకునే లోపే ఘోరం జ‌రిగిపోయింది.

రైలు కింద ప‌డి ఆశాదేవి మ‌ర‌ణించింది. అక్క‌డి నుంచి పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించిన సునీల్ ప్ర‌సాద్‌ను ప్ర‌యాణికులు ప‌ట్టుకుని దేహ‌శుద్ధి చేశారు. రైల్వే పోలీసుల‌కు అప్ప‌గించారు. సునీల్ ప్ర‌సాద్‌కు వేరే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఉంది.

ఈ విష‌యం ఆశాదేవికి తెలిసింది. దీనితో ఇద్ద‌రి మ‌ధ్యా త‌ర‌చూ గొడ‌వ‌లు చెల‌రేగుతుండేవి. దీనితో ఆమె హ‌త్య చేయాల‌ని ప‌థ‌కం ప‌న్నిన సునీల్ ప్ర‌సాద్‌.. పుట్టింటికి తీసుకెళ్తాన‌ని న‌మ్మించి రైలు కింద తోసి చంపాడని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. సునీల్ ప్ర‌సాద్‌పై పోలీసులు హ‌త్య‌కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here