బ్రేక్ బ‌దులు యాక్సిలేట‌ర్ నొక్కి ఉంటాడు..దీని ఫ‌లితం? డ్రైవ‌ర్ ఎవ‌రో తెలిస్తే విస్తుపోతారు!

ల‌క్నో: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని క‌న్నౌజ్ సిటీ అది. ఆ న‌గ‌ర శివార్ల‌లో ఉన్న పెట్రోల్ బంక్‌లో ఇద్ద‌రు సిబ్బంది బైక్‌ల‌కు పెట్రోలు నింపే ప‌నిలో ఉన్నారు. ఇంధ‌నాన్ని నింపుకోవ‌డానికి అటుగా వ‌చ్చిందో ఎర్ర రంగు కారు.

`ప‌దండి ముందుకు..ప‌దండి తోసుకు..` అన్న‌ట్టు వేగంగా పెట్రోల్ బంకులోకి ఎంట‌ర్ అయ్యింది. అక్క‌డితో ఆగిపోతే బాగుండు. ఆగ‌లేదే. బ్రేక్ బ‌దులు యాక్సిలేట‌ర్ నొక్కేసి ఉంటాడా డ్రైవ‌ర్‌. పెట్రోల్ బంక్‌లో మొద‌ట ఓ కుర్చీని ఢీ కొట్టింది.

అలాగే నేరుగా వెళ్లిపోయి ఉన్నా బాగుండు. అదేవేగంతో ఎడ‌మ చేతి వైపు ట‌ర్న్ తీసుకుంది. దాన్ని చూసిన ఓ పెట్రోల్‌బంకు ఉద్యోగి ఒక‌రు.. ఇదేదో కొంప‌లు ముంచుతోంద‌నుకుంటూ ల‌గ్గెత్తాడు. ఫిల్ల‌ర్‌ను ఢీ కొట్టిన కారు అక్కడికీ ఆగ‌లేదు.

పెట్రోల్ నింపుకొంటున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఆ బైక్‌పై ఇద్ద‌రు యువ‌కులు ఉన్నారు. వెనుక కూర్చున్న వ్య‌క్తి భ‌యంతో గుండెలు అర‌చేత్తో ప‌ట్టుకుని ప‌రుగెత్త‌గా.. బైక్‌ను న‌డుపుతున్న యువ‌కుడు మాత్రం కారు కింద ప‌డ్డాడు. అయినా ఆగ‌లేదా కారు.

అలాగే ట‌ర్న్ తీసుకుంటూ వ‌చ్చి, ఎదురుగా ఉన్న ఇంకో ఫిల్ల‌ర్‌ను ఢీ కొట్టిన త‌రువాతే ఆగిపోయింది. అప్ప‌టిదాకా ఎక్క‌డ ఉన్నారో గానీ.. కారు ఆగిన వెంట‌నే బిల‌బిల‌మంటూ వ‌చ్చేశారు జ‌నం. కారు చుట్టు మూగారు.

కారు డ్రైవ‌ర్ త‌ప్పించుకుని పారిపోయే ప్ర‌య‌త్న‌మేమీ చేయ‌లేదు. అత‌ని భ‌యం అత‌నిది. సిన్సియ‌ర్‌గా కిందికి దిగి.. కారు కింద ప‌డ్డ యువ‌కుడు ఏమ‌య్యాడోనంటూ తొంగి తొంగి చూశాడు. ఇంత‌కీ ఆ కారును న‌డిపిందెవ‌రో కాదు. ఓ లెర్న‌ర్‌.  అప్పుడ‌ప్పుడే కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడ‌ట‌.

కారు స్టీరింగ్ చేతికి తీసుకుని స‌రిగ్గా రెండు రోజులే అయ్యింద‌ట‌. ఇంధ‌నాన్ని పోయించుకోవ‌డానికి ధైర్యం చేసి మ‌రీ పెట్రోల్ బంకుకొచ్చాడు. ఇలా ఓ చిన్న‌సైజు విధ్వంసాన్నే సృష్టించాడు. ఈ వ్య‌వ‌హారం అంతా అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యింది.

ఇంకో ట్విస్టేమిటంటే.. కారు కింద ప‌డ్డ యువ‌కుడు స్వ‌ల్ప గాయాల‌తో లేచి నిల్చున్నాడు. ఆ త‌రువాత డ్రైవ‌ర్ ప‌ని ప‌ట్టే ఉంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here