ఆరు రోజుల పాటూ సౌదీ అరేబియా ఎడారిలో బ్రతికాడు.. ఎట్టకేలకు..!

సౌదీ అరేబియా లోని ఎడారిలో తప్పిపోతే తిరిగి ప్రాణాలతో బయటకు రావడమన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా ఆరు రోజుల పాటూ సౌదీ అరేబియాలోని ఎడారిలో తప్పిపోయాడు. అంతా ఏమైపోయాడో అని టెన్షన్ పడ్డారు. కానీ ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఆరు రోజుల క్రితం మౌతమ్ గ్రామంలో హోసామ్ అల్ సలామీ అనే వ్యక్తి తప్పిపోయాడు. అయితే ఎట్టకేలకు అతడు తబూక్ పోలీసులకు దొరికాడు. అతడి కోసం వెళ్ళిన రెస్క్యూ టీమ్ అతన్ని కనుక్కోవడంలో సహాయపడింది. ఆరు రోజుల పాటూ ఎడారిలో ఉన్నప్పటికీ అతడు ఆరోగ్యంగానే ఉండడం విశేషం. తబూక్ నుండి అతడు మక్కాకు వెళుతుండగా దారి తప్పిపోయాడు. తాను దారి తప్పానని ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన అతడి నుండి ఎలాంటి స్పందన లేదు. దీంతో అతడి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాదాపు ఆరు రోజులు అతడు ఎలాగోలా ఎడారిలో ప్రాణాలతో ఉండగలిగాడు. ఇప్పుడు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆరు రోజులు ఎలా ఉండగలిగాడన్నది అతడే చెప్పాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here