ప్రేమించి, పెళ్లి చేసుకున్న‌ట్టు నాట‌క‌మాడి, గ‌ర్భం దాల్చిన‌ త‌రువాత‌..!

ప్రేమ పేరుతో నాట‌కం ఆడాడో యువ‌కుడు. మూడో కంటికి తెలియ‌కుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. స‌హ‌జీవ‌నం చేశాడు. భార్య నెల త‌ప్పిన‌ట్టు తెలియ‌గానే ఇక ఇంటికి రావ‌డం మానేశాడు. అడ్ర‌స్ లేకుండా పోయాడు.

దీనితో తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించిన ఆ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. అదే స‌మ‌యంలో మ‌రో వ్య‌క్తి ఆమె జీవితంలోకి ప్ర‌వేశించాడు.

కొత్త జీవితాన్ని ఇస్తాన‌ని ఆశ‌పెట్టాడు. ఆ యువ‌తి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. బాబుకు రెండేళ్లొచ్చాయి. త‌న జీవితం కుదుట‌ప‌డింద‌ని అనుకునే లోపే.. ఆ వ్య‌క్తి కూడా ఆమెను మోస‌గించాడు.

దీనితో బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఈ ఘ‌టన క‌ర్ణాట‌క‌లోని హ‌వేరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రాణిబెన్నూరు తాలూకాలోని బెళ‌గెరి గ్రామానికి చెందిన బాధితురాలి పేరు సునంద (పేరుమార్చాం).

వయ‌స్సు 22 సంవ‌త్స‌రాలు. అదే గ్రామానికి చెందిన సంజీవ అనే యువ‌కుడు ప్రేమ పేరుతో సునంద‌ను ఏమార్చాడు. శారీర‌క సంబంధాన్ని ఏర్ప‌ర‌చుకున్నాడు.

పెళ్లి చేసుకున్న‌ట్టు నాట‌కం ఆడాడు. ఎవ‌రికీ తెలియ‌కుండా పెళ్లి చేసుకున్నాడు. ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో ముఖం చాటేశాడు. ఆ స‌మ‌యంలో ఆమె జీవితంపై విర‌క్తి చెంది ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించారు.

అదే స‌మ‌యంలో గౌడ‌ప్ప అనే వ్య‌క్తితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అండ‌గా ఉంటాన‌ని చెప్పిన అత‌ను కూడా సునంద‌ను మోసం చేశాడు. దీనితో ఆమె రాణిబెన్నూరు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

పోలీసులు బాధితురాలిని స్థానిక నిస‌ర్గ మ‌హిళా స్వాంత‌న స్వ‌చ్ఛంద కేంద్రంలో చేర్చారు. ప్ర‌స్తుతం ఆమె త‌న కుమారుడితో స‌హా అక్క‌డే ఆశ్ర‌యం పొందుతున్నారు. రాణిబెన్నూరు రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here