ఇంటికి పిలిచి..సెక్స్‌కు బ‌ల‌వంతం చేసి..షూలేస్‌తో ఉరేసి!

ముంబై: ఫేస్‌బుక్ ద్వారా ప‌రిచ‌య‌మైన యువ‌తిని ప్రేమించాడో యువ‌కుడు. ఏడాది కాలంగా రోజూ వారు ఆన్‌లైన్ ఛాటింగ్‌లో గంట‌ల‌కొద్దీ గ‌డిపేవారు. ఆ ర‌కంగా ఇద్ద‌రి మ‌ధ్యా సాన్నిహిత్యం పెరిగింది. ఇద్ద‌రూ క‌లుసుకోవాల‌ని నిర్ణ‌యానికొచ్చారు. ఏకంగా త‌న ఇంటికే పిలిచాడత‌ను.

త‌న ఇంట్లోనే క‌లుసుకుందామ‌ని చెప్పాడు. దీన్ని గుడ్డిగా న‌మ్మిందా యువ‌తి. ఒంట‌రిగా అత‌ని ఇంటికి వెళ్లింది. ఇంటికి రావ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించాడ‌త‌ను. ఆమె రాగానే.. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించ‌బోయాడు. సెక్స్‌కు బ‌ల‌వంతం చేశాడు. అత‌ని ఉద్దేశాన్ని ప‌సిగ‌ట్టిన ఆ యువ‌తి ప్ర‌తిఘ‌టించింది. అత‌ని ఇంట్లో నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. అవేవీ అత‌ని ముందు ఫ‌లించ‌లేదు.

సెక్స్‌కు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ప‌శువులా మారాడ‌త‌ను. త‌న షూలేస్ తీసి, ఆమెకు ఉరి బిగించి హ‌త్య‌చేశాడు. ఆమె మృత‌దేహాన్ని ఇంటి మెట్ల‌పై ప‌డేసి, పారిపోయాడు. మృతురాలి పేరు అంకిత మోరె. ఆ కిరాత‌కుడి పేరు హ‌రిదాస్‌. మ‌హారాష్ట్రలోని పాల్ఘర్‌లో చోటు చేసుకుందీ ఘ‌ట‌న‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here