భార్య‌, కుమార్తెను చంపి, వారి మృత‌దేహాలను ఏం చేయాలో తెలీక‌..!

అనుమానం పెనుభూత‌మైంది. భార్య ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానంతో ర‌గిలిపోయిన ఆ వ్య‌క్తి కిరాత‌కుడిగా మారాడు. క‌ట్టుకున్న భార్య‌ను, కన్న కుమార్తెను కుత్తుక కోసి దారుణంగా హ‌త్య చేశాడు. రెండు రోజుల పాటు వారి మృత‌దేహాలను ఇంట్లోనే దాచి ఉంచాడు. చివ‌రికి- పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. క‌ర్ణాట‌క‌లోని మైసూరులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

హ‌తుల‌ పేర్లు స‌విత‌, సించ‌న. హంత‌కుడి పేరు ప్ర‌జ్వ‌ల్‌. మైసూరులోని విజ‌య‌న‌గ‌ర పోర్త్ ఫేస్‌లో నివాసం ఉండే ప్ర‌జ్వ‌ల్‌కు 12 ఏళ్ల కింద‌ట స‌విత‌తో వివాహ‌మైంది. వారికి ఓ కుమార్తె. పేరు సించ‌న‌. భార్య ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానంతో ర‌గిలిపోయిన ప్ర‌జ్వ‌ల్ మంగ‌ళ‌వారం రాత్రి నిద్ర‌పోతున్న భార్య‌ను గొంతు కోసి హ‌తమార్చాడు.

దాన్ని చూసినందుకు కుమార్తెకు కూడా అదే శిక్ష విధించాడు. చిన్నారి అనే దయా దాక్షిణ్యం కూడా లేకుండా కుమార్తెను క‌డ‌తేర్చాడు. అనంత‌రం- మృత‌దేహాల‌ను ఏం చేయాలో అత‌నికి తోచ‌లేదు. దీనితో- రెండురోజుల పాటు వాటిని ఇంట్లోనే ఉంచాడు. గురువారం రాత్రి తాను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు.

గొంతు కోసుకున్నాడు. రెండురోజులుగా త‌మ కుమార్తె, మ‌న‌వ‌రాలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో స‌విత త‌ల్లిదండ్రులు అదే స‌మ‌యానికి ఇంటికొచ్చారు. ఇంట్లో ఉన్న భ‌యాన‌క ప‌రిస్థితుల‌ను చూసి కుప్ప‌కూలిపోయారు. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన‌లు స్వాధీనం చేసుకున్నారు. రక్త‌పుమ‌డుగులో ఉన్న ప్ర‌జ్వ‌ల్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌జ్వ‌ల్ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here