భార్యాభర్తలు పిల్లాడితో పాటు ఏటీఎం సెంటర్ లోకి వెళ్ళారు.. మరొక వ్యక్తి లోపలికి వచ్చాడు..!

దొంగతనం చేసే వారు ఏటీఎం సెంటర్లను టార్గెట్ గా చేసుకున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే చాలా ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ సరిగా ఉండదు కాబట్టి. తాజాగా ఓ షాకింగ్ ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది. భార్యాభర్తలు తమ పిల్లాడితో కలసి ఏటీఎం సెంటర్ లోకి వెళ్ళాడు. వారి వెనకాలే మరో వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకొని వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన ఆ వ్యక్తి పిల్లాడి తలపై గన్ను పెట్టి డబ్బులు డ్రా చేసి ఇమ్మని చెప్పాడు. ఇక చేసేదేమీ లేక ఆ దంపతులు తమ దగ్గర ఉన్న డబ్బును అతడికి ముట్టజెప్పారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జనవరి 24 రాత్రి 8.30 ప్రాంతంలో ఓ దంపతులు తమ చిన్నారితో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లారు. వాళ్ల వెనక ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి ఏటీఎంలోకి చొరబడి గన్‌తో వాళ్లను బెదిరించాడు. వెంటనే ఆ వ్యక్తి తన జేబులో ఉన్న డబ్బు తీసిచ్చినప్పటికీ చిన్నారి మీద గన్ గురిపెట్టి మరిన్ని డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని బెదిరించాడు. ఆ వ్యక్తి మరిన్ని డబ్బులు డ్రా చేసి ఆ దుండగుడి చేతిలో పెట్టాడంతో అతడు అక్కడి నుండి పారిపోయాడు.

https://twitter.com/i/web/status/958643585506783232

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here